అత్యుత్తమ ఫ్లైయాష్ వినియోగ సంస్థగా అవార్డు గెలుచుకున్న సంస్థ?
Sakshi Education
థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిద (ఫ్లైయాష్)ను 100 శాతం వినియోగంలోకి తెచ్చినందుకు గాను అత్యుత్తమ ఫ్లైయాష్ వినియోగ సంస్థగా ‘‘సింగరేణి సంస్థ’’కి జాతీయ పురస్కారం లభించింది.
500 మెగావాట్ల పైబడి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న థర్మల్ ప్లాంట్ల విభాగంలో సింగరేణికి ఈ పురస్కారం దక్కింది. ఏప్రిల్ 10న గోవాలో మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సింగరేణి డెరైక్టర్ డి.సత్యనారాయణరావు అవార్డు అందుకున్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిదను ప్రధానంగా సిమెంటు కంపెనీలకు రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ సీఎండీగా ఎన్.శ్రీధర్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యుత్తమ ఫ్లైయాష్ వినియోగ సంస్థగా అవార్డు గెలుచుకున్న సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : సింగరేణి సంస్థ
ఎక్కడ : గోవా
ఎందుకు : థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిద (ఫ్లైయాష్)ను 100 శాతం వినియోగంలోకి తెచ్చినందుకు గాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యుత్తమ ఫ్లైయాష్ వినియోగ సంస్థగా అవార్డు గెలుచుకున్న సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : సింగరేణి సంస్థ
ఎక్కడ : గోవా
ఎందుకు : థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిద (ఫ్లైయాష్)ను 100 శాతం వినియోగంలోకి తెచ్చినందుకు గాను
Published date : 12 Apr 2021 06:25PM