Skip to main content

అత్యుత్తమ జీవన నగరంగా వియన్నా

ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా నిలిచింది.
అత్యుత్తమ నగరాన్ని ఎంపిక చేసేందుకు ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా 140 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను సెప్టెంబర్ 4న విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం 99.1 పాయింట్లతో గతేడాదిలాగే వియన్నా తొలిస్థానంలో నిలవగా.. కెనాడాలోని సిడ్నీ, జపాన్‌లోని ఒసాకాలు తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. చివరి స్థానంలో నిలిచిన సిరియాలోని డమాస్కస్ పట్టణానికి 30.7 పాయింట్లు లభించాయి.

ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితాలో ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారి 118వ స్థానంలో నిలచింది. నేరాలు పెరగడం, ప్రాణవాయువు నాణ్యత తగ్గడం వంటి కారణాల రీత్యా ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారింది. సాంస్కృతిక విభాగంలో తక్కువ పాయింట్లు రావడంతో ముంబై రెండు స్థానాలు దిగజారి 119వ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీకి 56.3 పాయింట్లు రాగా, ముంబైకి 56.2 పాయింట్లు వచ్చాయి.

ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాలు

ర్యాంకు

నగరం

దేశం

1

వియన్నా

ఆస్ట్రియా

2

సిడ్నీ

కెనాడా

3

ఒసాకా

జపాన్

48

లండన్

ఇంగ్లండ్

58

న్యూయార్క్

అమెరికా

76

బీజింగ్

చైనా

118

న్యూఢిల్లీ

భారత్

119

ముంబై

భారత్

136

కరాచీ

పాకిస్తాన్

138

ఢాకా

బంగ్లాదేశ్

140

డమాస్కస్

సిరియా

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అత్యుత్తమ జీవన నగరంగా వియన్నా
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 05 Sep 2019 06:05PM

Photo Stories