Skip to main content

అత్యంతవేగంగా కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ చేపట్టిన దేశం?

కేవలం 95 రోజుల్లోనే 13 కోట్ల కోవిడ్‌–19 టీకా డోసులు వేయడం ద్వారా అత్యంతవేగంగా వ్యాక్సినేషన్‌ చేపట్టిన దేశంగా భారత్‌ రికార్డు నెలకొల్పిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Current Affairs 13 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసేందుకు అమెరికాకు 101 రోజులు, చైనాకు 109 రోజులు పట్టాయని వివరించింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కింద ఏప్రిల్‌ 21న ఉదయం 7 గంటల వరకు 19,01,413 సెషన్లలో 13,01,19,310 డోసుల టీకా అందజేసినట్లు వెల్లడించింది.

కోవిషీల్డ్‌ ధర నిర్ణయం...
రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే కరోనా ‘కోవిషీల్డ్‌’ టీకా ధరలను పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ప్రకటించింది. ప్రభుత్వాలకు సరఫరా చేసే టీకా ధర రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ధర రూ.600గా ఉంటుందని ఆ సంస్థ సీఈఓ అదార్‌ సి.పూనావాలా ఏప్రిల్‌ 21న వెల్లడించారు. 2021, మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిటన్‌కి చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 ‘‘కోవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తుంది.
Published date : 22 Apr 2021 07:50PM

Photo Stories