Skip to main content

అత్యంత వేగవంతమైన దూరదృష్టి కలిగిన పక్షి

‘పెరెగ్రిన్ ఫాల్కన్’ అనే గద్ద పక్షి జాతిలోనే అత్యంత వేగవంతమైన దూరదృష్టి కలిగి ఉంటుందని తేలింది.
Current Affairsఒక సెకనుకు దాదాపు 130 ఫ్రేమ్‌లను ఫాల్కన్ తన కళ్లతో బంధిస్తుందని తెలిసింది. స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధన ద్వారా వేటాడే పక్షుల దృష్టిపై తొలిసారిగా అధ్యయనం చేసి, ఎదురుగా కనిపించే దానికి ఎలా స్పందిస్తుందనే విషయం తెలుసుకున్నట్లు లుండ్ వర్సిటీకి చెందిన అల్ముట్ కెల్బర్ తెలిపారు. ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.

లుండ్ వర్సిటీ అధ్యయనం ప్రకారం...
  • సరైన వెలుతురు ఉన్న వాతావరణంలో పెరెగ్రిన్ ఫాల్కన్ సెకనుకు 129 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలదు.
  • సేకర్ ఫాల్కన్ అనే గద్ద సెకనుకు 102, హారిస్ హాక్ డేగ 77 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలవు.
  • మానవుడి కళ్లు ఒక సెకనులో 50 నుంచి 60 ఫ్రేమ్‌లను మాత్రమే బంధించగలుగుతాయి.
  • సేకర్ ఫాల్కన్, హారిస్ హాక్ డేగలు నేలపై మెల్లగా కదిలే క్షీరదాలను మాత్రమే వేటాడుతుంటాయని, అందుకే వాటికి తక్కువ దూరదృష్టి ఉంటుంది. పెరెగ్రిన్ ఫాల్కన్ మాత్రం తన ఆహారాన్ని చూసిన వెంటనే ఆకాశం నుంచి దాదాపు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో కిందకు దిగుతుంది.
Published date : 23 Dec 2019 05:36PM

Photo Stories