అత్యంత శక్తివంతమైన తుపాకీ అభివృద్ధి
Sakshi Education
మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషిని లేదా జంతువును గురిపెట్టి సునాయాసంగా చంపేసే అత్యంత ప్రమాదరకమైన స్నైపర్ తుపాకీని రష్యాకు చెందిన లొబోవ్ ఆర్మ్స్ కనిపెట్టింది.
ఎస్‌వీఎల్‌కే–14ఎస్‌గా వ్యవహరించే పది కిలోల బరువుగల ఇది తుపాకుల విభాగంలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని భావిస్తున్నారు. ఈ తుపాకీలో నుంచి బుల్లెట్ సెకండ్‌కు 900 మీటర్ల దూరం చొప్పున అంటే, ధ్వని వేగంకన్నా మూడు రెట్లు ఎక్కువ ప్రయాణం చేస్తుంది. దీని ధర అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు 29 లక్షల రూపాయలుగా ఉంది.
ఎస్‌వీఎల్‌కే–14ఎస్ నుంచి వెలువడే బుల్లెట్ మూడు సెంటీమీటర్ల మందం గల ఇనుప దిమ్మ నుంచి దూసుకుపోతుందని, ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించిన వ్యక్తి కూడా ఈ బుల్లెట్ తగిలితే మరణించాల్సిందేనని ఈ తుపాకీని తయారు చేసిన కంపెనీ చీఫ్ ఇంజనీరు యూరి సించ్‌కిన్ తెలిపారు. ఈ తుపాకీ నుంచి వెలువడే బుల్లెట్ మూడున్నర కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని, గురి తప్పకుండా ఉండాలంటే మూడు కిలోమీటర్లకు మించి లక్ష్యం ఉండరాదని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రిటీష్ సైన్యం ఉపయోగిస్తున్న ‘ఎల్115ఏ3’ తుపాకీ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇదే ఇంతవరకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తుపాకీగా చెలామణి అవుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత శక్తివంతమైన తుపాకీ అభివృద్ధి
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : రష్యాకు చెందిన లొబోవ్ ఆర్మ్స్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత శక్తివంతమైన తుపాకీ అభివృద్ధి
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : రష్యాకు చెందిన లొబోవ్ ఆర్మ్స్
Published date : 14 Apr 2020 06:20PM