Skip to main content

అత్యంత ప్రతిభావంతులైన వంద మంది శాస్త్రవేత్తల్లో ఏపీ శాస్త్రవేత్త

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ప్రొఫెసర్ చల్లపల్లి సూర్యనారాయణకు అరుదైన గుర్తింపు లభించింది.
Current Affairs
పదార్థ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రపంచంలోనే ‘మేటి వంద మంది శాస్త్రవేత్తల్లో ఒకరిగా ఆయన నిలిచారు. అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో చల్లపల్లి సూర్యనారాయణకు 55వ స్థానం దక్కింది.

కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన సూర్యనారాయణ అక్కడే కొంతకాలం ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. 1988 తర్వాత నుంచి అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలో విధులు నిర్వర్తిస్తున్నారు. పదార్థ విజ్ఞాన శాస్త్ర రంగంలో చేసిన సేవలకు దేశ, విదేశాల నుంచి అనేక పురస్కారాలను అందుకున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అత్యంత ప్రతిభావంతులైన వంద మంది శాస్త్రవేత్తల్లో ప్రొఫెసర్ చల్లపల్లి సూర్యనారాయణ
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 20 Oct 2020 05:39PM

Photo Stories