Skip to main content

అత్యధిక సంపద కలిగిన నగరంగా న్యూయార్క్

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద కలిగిన నగరంగా అమెరికాలోని న్యూయార్క్ నిలిచిందని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది.
Current Affairsఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లండన్, పారిస్ నగరాలు ఉన్నాయని పేర్కొంది. భారత్ నుంచి ముంబై 44వ స్థానంలో, ఢిల్లీ 58, బెంగళూరు 89వ స్థానంలో ఉన్నామని వివరించింది. ఈ మేరకు నైట్‌ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్-2020 పేరుతో మార్చి 5న ఒక నివేదిక విడుదల చేసింది.

నైట్‌ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్‌లోని అంశాలు
  • 2024 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సంపద కలిగిన కేంద్రంగా ఆసియా నిలుస్తుంది.. ఐదేళ్ల వృద్ధి అంచనా 44 శాతం ఉంటుంది.
  • ఆసియాలో చూస్తే.. 73 శాతం వృద్ధితో ఇండియా మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో 64 శాతంతో వియత్నాం, 58 శాతంతో చైనా, 57 శాతం వృద్ధితో ఇండోనేషియా దేశాలుంటాయి.
  • ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంఖ్య వేగంగా పెరుగుతోంది.
  • ప్రస్తుతం భారత్‌లో 5,986లుగా ఉన్న యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంఖ్య.. 2024 నాటికి 73 శాతం వృద్ధితో 10,354లకు చేరుతుంది. రూ.220 కోట్లకు పైగా నికర సంపద ఉన్న వాళ్లని యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐగా పరిగణించారు.
  • ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అల్ట్రా శ్రీమంతులున్న దేశం అమెరికా. ఇక్కడ 2,40,575 మంది యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలుంటే.. చైనాలో 61,587 మంది, జర్మనీలో 23,078 మంది ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అత్యధిక సంపద కలిగిన నగరంగా న్యూయార్క్
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : నైట్‌ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 06 Mar 2020 05:48PM

Photo Stories