Skip to main content

అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడు?

ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) కొత్త చరిత్ర సృష్టించాడు. ఇటలీ రాజధాని రోమ్‌లో సెప్టెంబర్ 21న ముగిసిన ఇటాలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి అత్యధిక అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.
Edu news
ఈ టోర్నీకి ముందు రాఫెల్ నాదల్ (స్పెరుున్), జొకోవిచ్ 35 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌తో సమఉజ్జీగా ఉన్నారు. తాజా విజయంతో నాదల్‌ను వెనక్కి నెట్టి జొకోవిచ్ 36 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌తో చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

తాజా మ్యాచ్‌లో..
తాజాగా జరిగిన ఇటాలియన్ ఓపెన్‌లో డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 7-5, 6-3తో విజయం సాధించాడు. చాంపియన్ జొకోవిచ్‌కు 2,05,200 యూరోలు (రూ. కోటీ 77 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించారుు. 2020 ఏడాది జొకోవిచ్‌కిది నాలుగో టైటిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్, దుబాయ్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్‌లలో కూడా జొకోవిచ్ విజేతగా నిలిచాడు.

మహిళల సింగిల్స్‌లో...
ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ సిమోనా హలెప్ (రొమేనియా) విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన ఫైనల్లో హలెప్ తొలి సెట్‌ను 6-0తో నెగ్గి, రెండో సెట్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్నపుడు ప్లిస్కోవా తొడ కండరాల గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగింది. విజేత హలెప్‌కు 2,05,190 యూరోలు (రూ. కోటీ 77 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కారుు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అత్యధిక ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)
ఎక్కడ : ఇటాలియన్ ఓపెన్
Published date : 23 Sep 2020 06:38PM

Photo Stories