అత్యధిక కాలం యుద్ధ రంగంలో సేవలందించిన నౌక?
Sakshi Education
భారత నావికా దళ విమాన వాహక నౌక ‘ఐఎన్‌ఎస్ విరాట్’ను కూల్చివేయడంపై ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టు స్టే విధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎన్‌ఎస్ విరాట్’ను కూల్చివేయడంపై స్టే
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : జాతి ప్రయోజనాల రీత్యా నావికాదళ నౌకని ధ్వంసం చేయరాదని ఎంఎస్ ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ పిటిషన్ దాఖలు చేయడంతో
జాతి ప్రయోజనాల రీత్యా నావికాదళ నౌకని ధ్వంసం చేయరాదని, ఈ చారిత్రక నౌకను భద్రపరచాలని కోరుతూ ‘ఎంఎస్ ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్’ అనే ప్రైవేటు కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.
2020 ఏడాది జరిగిన వేలంపాటలో దాదాపు రూ.65కోట్లకు శ్రీరాం షిప్ బ్రేకర్స్ కంపెనీ... విరాట్‌ను కొనుగోలు చేసింది. గుజరాత్‌లోని అలంగ్ బీచ్‌లో ఈ నౌకను విచ్ఛిన్నంచేయనుంది. విరాట్‌ను రూ. 100 కోట్లకు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు ఎన్విటెక్ సంస్థ తెలిపింది. ఈ నౌకను కొనుగోలు చేసి, సముద్ర మ్యూజియంగా మార్చాలని భావిస్తోన్నట్లు పేర్కొంది. దీనిపై స్పందించాల్సిందిగా హోంమంత్రిత్వ శాఖను, నౌక ప్రస్తుత యజమానిని కోర్టు కోరింది.
విరాట్ ప్రత్యేకతలు...
- ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం యుద్ధ రంగంలో సేవలందించిన నౌక ఇదే.
- 1959లో బ్రిటిష్ రాయల్ నేవీలో చేరింది. ఆ తర్వాత 1984లో దీన్ని ఉపసంహరించి భారత్‌కు విక్రయించారు.
- 1982లో దక్షిణ అట్లాంటిక్‌లో జరిగిన ఫాక్లాండ్ దీవుల్లో జరిగిన యుద్ధంలో అద్భుతమైన సేవలు అందించింది
- 1987లో భారత నౌకాదళంలో చేరిన విరాట్.. దాదాపు 30ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించింది.
- విరాట్‌ను విచ్ఛిన్నం చేస్తే.. భారత్‌లో నిర్వీర్యం అవుతున్న రెండో యుద్ధ నౌక ఇదే కానుంది. అంతకుముందు 2014లో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను తుక్కుగా చేశారు. ఆ విడిభాగాలతో ఓ ఆటోమొబైల్ సంస్థ ద్విచక్రవాహనాలకు కూడా తయారుచేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎన్‌ఎస్ విరాట్’ను కూల్చివేయడంపై స్టే
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : జాతి ప్రయోజనాల రీత్యా నావికాదళ నౌకని ధ్వంసం చేయరాదని ఎంఎస్ ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ పిటిషన్ దాఖలు చేయడంతో
Published date : 12 Feb 2021 12:03PM