Skip to main content

అత్యధిక డాలర్లు జమ అయిన దేశంగా భారత్

2018 ఏడాదిలో డాలర్ల రూపంలో అత్యధికంగా సొమ్ము జమ అయిన దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
ఈ మేరకు ఏప్రిల్ 9న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2018లో భారత్‌కు వివిధ దేశాల నుంచి 79 బిలియన్ డాలర్లు చేరాయి. ఆ తర్వాత చైనా (67 బిలియన్ డాలర్లు), మెక్సికో (36 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ 34 (బిలియన్ డాలర్లు), ఈజిప్ట్(29 బిలియన్ డాలర్లు) దేశాలు ఉన్నాయి. పాకిస్థాన్‌కు విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య మితంగా (7శాతం) ఉంది.

భారత్‌కు విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య 2018లో 14 శాతం పెరిగింది. కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన తమ వారిని ఆదుకునేందుకు అనేకమంది పెద్దమొత్తంలో సొమ్మును భారత్‌కు పంపారని ప్రపంచబ్యాంకు తెలిపింది. దక్షిణాసియాకు పంపుతున్న నగదు 12 శాతం మేర పెరిగిందని 2018లో ఆ మొత్తం 131 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొంది. భారత్‌కు డాలర్ల రూపంలో 2016లో 62.7 బిలియన్ డాలర్లు, 2017లో 65.3 బిలియన్ డాలర్లు వచ్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2018లో అత్యధిక డాలర్లు జమ అయిన దేశంగా భారత్
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : ప్రపంచ బ్యాంకు
Published date : 10 Apr 2019 04:39PM

Photo Stories