అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా విరాట్
Sakshi Education
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా మూడో ఏడాది భారత్‌లో అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు.
ద డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం రూ.1690 కోట్ల బ్రాండ్ విలువతో కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. రూ.743 కోట్లతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో కోహ్లి బ్రాండ్ విలువ 39 శాతం పెరిగింది.
నలుగురు క్రికెటర్లు..
2019 ఏడాదికి సంబంధించి రూపొందించిన ‘అత్యధిక బ్రాండ్ విలువ గల భారత ప్రముఖుల జాబితా’లో టాప్-20లో కోహ్లి సహా నలుగురు క్రికెటర్లు ఉన్నారు. ధోని (రూ.293 కోట్లు) 9వ స్థానంలో, సచిన్ టెండూల్కర్(రూ. 153 కోట్లు) 15వ స్థానంలో, రోహిత్ శర్మ (రూ.163 కోట్లు) 20వ స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా విరాట్ కోహ్లి
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : ద డఫ్ అండ్ ఫెల్ప్స్
ఎక్కడ : భారత్

Published date : 07 Feb 2020 05:47PM