Skip to main content

అటన్‌బరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి

ప్రకృతి శాస్త్రవేత్త, ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ సర్ డేవిడ్ అటన్‌బరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి-2019 లభించింది.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఈ అవార్డు విజేతను ఎంపిక చేసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్టు నవంబర్ 19న ఓ ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన 93 ఏళ్ల అటన్‌బరో జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో కృషి చేశారు. ప్రకృతి సంపదపై ఎన్నో పుస్తకాలు రాశారు.

మరోవైపు 2018 సంవత్సరానికి గాను ప్రకటించిన ‘ఇందిరాగాంధీ శాంతి బహుమతి’ని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’(సీఎస్‌ఈ) సారథి సునీతా నారాయణ్‌కు నవంబర్ 19న ప్రదానం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇందిరాగాంధీ శాంతి బహుమతి-2019కి ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : సర్ డేవిడ్ అటన్‌బరో
ఎందుకు : జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో కృషి చేసినందుకు
Published date : 20 Nov 2019 04:48PM

Photo Stories