అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ
Sakshi Education
దేశంలో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నిలిచిందని ఆంఫి (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా) వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను జనవరి 3న విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ ఎమ్‌ఎఫ్ రూ.3.35 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులతో మొదటిస్థానంలో ఉండగా రూ.3.08 లక్షలతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే రూ.2.64 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులతో ఎస్‌బీఐ ఎమ్‌ఎఫ్ మూడో స్థానం పొందగా ఆ తర్వాతి స్థానాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఎమ్‌ఎఫ్(రూ.2.42 లక్షల కోట్లు), రిలయన్స్ ఎమ్‌ఎఫ్(రూ.2.36 లక్షల కోట్లు)లు ఉన్నాయి. మొత్తం మీద అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.23.61 లక్షల కోట్లుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ఆంఫి (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా)
ఎక్కడ : దేశంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ఆంఫి (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా)
ఎక్కడ : దేశంలో
Published date : 04 Jan 2019 05:45PM