Skip to main content

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్-2021 విజేత?

సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్... ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో జపనీస్ స్టార్ నయోమి ఒసాకా చాంపియన్‌గా అవతరించింది.
Current Affairs
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 20న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ ఒసాకా 6-4, 6-3తో అమెరికాకు చెందిన 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీని చిత్తు చేసింది. దీంతో ఒసాకా రెండోసారి ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నట్లయింది. గతంలో 2019లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను ఒసాకా గెలిచింది. తాజా విజయంతో ఒసాకా... ఓవరాల్‌గా నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండు యూఎస్ ఓపెన్ (2018, 2020) టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.

మెర్టెన్స్-సబలెంక జంటకు డబుల్స్...
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)-అరినా సబలెంక (బెలారస్) జంట కై వసం చేసుకుంది. తుదిపోరులో బెల్జియం-బెలారస్ జోడీ 6-2, 6-3తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా క్రెజికొవా- కెటరినా సినియకొవా జంటపై అలవోక విజయం సాధించింది.

మిక్స్‌డ్ డబుల్స్‌లో...
మిక్స్‌డ్ డబుల్స్‌లో బార్బరా క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ విజేతగా నిలిచింది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన క్రెజికొవా-రాజీవ్ రామ్ జోడీ 6-1, 6-4తో ఆస్ట్రేలియన్ వైల్డ్‌కార్డ్ జంట సమంత స్టొసుర్-మాథ్యూ ఎడెన్‌పై విజయం సాధించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్-2021 విజేత?
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : నయోమి ఒసాకా
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
Published date : 22 Feb 2021 06:07PM

Photo Stories