Skip to main content

ఆస్ట్రేలియా పై 2-1 తేడాతో వన్డే సిరీస్‌ భారత్ సొంతం

ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ ఘనమైన ముగింపునిచ్చింది. కంగారూ టూర్‌లో టీమిండియా విసిరిన ఆఖరి పంచ్ సరిగ్గా లక్ష్యాన్ని తాకింది.
మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకొని కోహ్లి బృందం మరోసారి తమ సత్తాను ప్రదర్శించింది. జనవరి 18న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్చివరి మ్యాచ్‌లో 42 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీయడంతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’పురాస్కారం అందుకున్నాడు.సిరీస్‌లో ధోని మొత్తం 193 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందుకున్నాడు.
  1. లక్ష్య ఛేదనలో ధోని నాటౌట్‌గా నిలవడం ఇది 48వసారి. ఇందులో భారత్ 46 సార్లు గెలవగా ఒక సారి ఓడింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది.
  2. ఒకే సిరీస్‌లో ధోని మూడు హాఫ్ సెంచరీలు చేయడం ఇది మూడో సారి. గతంలో ఇంగ్లండ్‌లో (2011), న్యూజిలాండ్‌లో (2014) అతను ఈ ఘనత సాధించాడు.
  3. ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ నెగ్గడం భారత్‌కిదే తొలిసారి.

క్విక్ రివ్యూ :
ఏమిటి:
వన్డే సిరీస్ భారత్ సొంతం
ఎప్పుడు: జనవరి 18
ఎవరు: భారత్-ఆస్ట్రేలియా
ఎక్కడ: మెల్‌బోర్న్
Published date : 19 Jan 2019 07:43PM

Photo Stories