Skip to main content

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అత్యాచారం

ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌజ్‌లో ఒక ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన సంచలన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Current Affairs2019 ఏడాదిలో నాటి రక్షణ పరిశ్రమల మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో సహోద్యోగి చేతిలో అత్యాచారానికి గురయ్యానని ప్రభుత్వ మాజీ ఉద్యోగిని బ్రిటనీ హిగిన్స్ ఫిబ్రవరి 15న ఆరోపించారు. ఈ విషయంలో న్యాయం పొందేందుకు.. మంత్రి లిండా, సహోద్యోగుల నుంచి నాకు సహకారం లభించలేదని, ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో పోలీసులకు కంప్లయింట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఆమెకు క్షమాపణలు తెలిపారు.

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధి జిల్లాలో ఫిబ్రవరి 16న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్నా గ్రామం సమీపంలోని శారద కాల్వలో ప్రైవేటు బస్సు పడిపోవడంతో 47 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. వీరిలో 20 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బస్సు సిద్ధి నుంచి సాత్నాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
Published date : 17 Feb 2021 06:04PM

Photo Stories