ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన భారత్
Sakshi Education
ఆస్ట్రేలియాలో భారత జట్టు చారిత్రాత్మక ‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ’ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది.
వర్షం కారణంగా చివరిదైన నాలుగో టెస్టు ఆఖరి రోజు ఒక్క బంతి కూడా పడలేదు. ఆసీస్ ఓవర్‌నైట్ స్కోరు 6/0 వద్దనే ఆట ఆగిపోయింది. దాంతో సిడ్నీ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. అడిలైడ్, మెల్‌బోర్న్ టెస్టులలో భారత్ గెలవగా... పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. ఫలితంగా ఆసీస్ గడ్డపై భారత్ తొలిసారి సిరీస్ గెలిచినట్లయింది. ఎప్పుడో 1947-48 సిరీస్‌తో మొదలు పెట్టి 2014-15 వరకు 11 సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా 8 సార్లు ఓడిపోగా... 3 సార్లు సమంగా నిలిచింది. ఎట్టకేలకు 72 ఏళ్ల తర్వాత 12వ ప్రయత్నంలో విజయం భారత్ సొంతమైంది. చతేశ్వర్ పుజారా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడంతో పాటు మొత్తంగా సిరీస్‌లో మూడు సెంచరీలు సహా 74.42 సగటుతో 521 చేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’అవార్డు కూడా గెలుచుకున్నాడు.
తొలిసారిగా మనం...
క్విక్ రివ్యూ :
ఏమిటి: ‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ’ టెస్టు సిరీస్‌లోభారత్విజయం
ఎప్పుడు: జనవరి 7
ఎవరు: ఆస్ట్రేలియా- భారత్
ఎక్కడ: ఆస్ట్రేలియా
- కెరీర్‌లో తొలిసారి పుజారా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు.
- దక్షిణాఫ్రికాలోనూ భారత్ గెలిస్తే... తొమ్మిది వేర్వేరు దేశాలపై వారి గడ్డపైనే టెస్టు సిరీస్‌లు గెలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సరసన చేరుతుంది.
- కోహ్లి సారథ్యంలో భారత జట్టు విదేశాల్లో నాలుగో సిరీస్ నెగ్గింది. తాజా విజయంతో సౌరవ్ గంగూలీ (4 సిరీస్‌లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశాడు.
- ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజయాలు సాధించిన జట్ల సంఖ్య. ఇంగ్లండ్ (13 సార్లు), వెస్టిండీస్ (4 సార్లు), దక్షిణాఫ్రికా (3 సార్లు), న్యూజిలాండ్, భారత్ (ఒక్కోసారి) ఈ ఘనత సాధించాయి.
తొలిసారిగా మనం...
సిరీస్ | విజేత | తుది ఫలితం |
1947-48 | ఆస్ట్రేలియా | 4-0 |
1967-68 | ఆస్ట్రేలియా | 4-0 |
1977-78 | ఆస్ట్రేలియా | 3-2 |
1980-81 | ‘డ్రా’ | 1-1 |
1985-86 | ‘డ్రా’ | 0-0 |
1991-92 | ఆస్ట్రేలియా | 4-0 |
1999-2000 | ఆస్ట్రేలియా | 3-0 |
2003-04 | ‘డ్రా’ | 1-1 |
2007-08 | ఆస్ట్రేలియా | 2-1 |
2011-12 | ఆస్ట్రేలియా | 4-0 |
2014-15 | ఆస్ట్రేలియా | 2-0 |
2018-19 | భారత్ | 2-1 |
ఏమిటి: ‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ’ టెస్టు సిరీస్‌లోభారత్విజయం
ఎప్పుడు: జనవరి 7
ఎవరు: ఆస్ట్రేలియా- భారత్
ఎక్కడ: ఆస్ట్రేలియా
Published date : 08 Jan 2019 05:25PM