Skip to main content

అస్త్ర ఎంకే -1 క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ?

<b>రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ-రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)</b> అభివృద్ధి చేసిన మూడు భద్రత వ్యవస్థలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిసెంబర్ 18న న్యూఢిల్లీలో త్రివిధ దళాల అధిపతులకు అందజేశారు.
Current Affairs ఇండియన్ మారిటైమ్ సిచ్యువేషనల్ అవేర్‌నెస్ సిస్టమ్(ఇమ్‌సాస్) నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్‌కు, అస్త్ర ఎంకే -1 క్షిపణి వ్య‌వ‌స్థను వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బధౌరియాకు, బోర్డర్ సర్వీలెన్స్‌ సిస్టమ్(బాస్)ను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణెకు రాజ్‌నాథ్ అందజేశారు. కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు.

చండీగఢ్‌లో మిలటరీ లిటరేచర్ ఫెస్టివల్...
చండీగఢ్‌లో డిసెంబర్ 18న జరిగిన మిలటరీ లిటరేచర్ ఫెస్టివల్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. దేశాల మధ్య ఘర్షణల విషయంలో సోషల్ మీడియా అధిక ప్రభావం చూపుతోందని ఆయన గుర్తుచేశారు. క్షిపణుల కంటే మొబైల్ ఫోన్ల పరిధే ఎక్కువ అని తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
త్రివిధ దళాల అధిపతులకు మూడు భద్రత వ్యవస్థల అందజేత
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు
Published date : 19 Dec 2020 07:10PM

Photo Stories