అసోంలో 13 వేల కోట్ల పెట్టుబడి : ఓఎన్‌జీసీ
Sakshi Education
అసోంలో చమురు అన్వేషణ, ఉత్పత్తి నిమిత్తం ఐదేళ్లలో రూ.13,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్‌జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) తెలిపింది.
ఈ విషయమై అసోం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని సెప్టెంబర్ 11న వెల్లడించింది. 2022 కల్లా దిగుమతులను 10% మేర తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీపిలుపు మేరకు ఈ పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొంది. నార్త్‌ఈస్ట్ హైడ్రోకార్బన్ విజన్ 2030లో భాగంగా ఈ పెట్టుబడుల ప్రణాళికను రూపొందించామని ఓఎన్‌జీసీ వివరించింది. అసోంలోని జోర్హాట్, గోల్హాట్ జిల్లాల్లో ఆరు బావులు, ఐదు మైనింగ్ బ్లాక్‌ల్లో డ్రిల్లింగ్ కోసం ఆమోదాలు పొందామని తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చమురు అన్వేషణ, ఉత్పత్తి నిమిత్తం ఐదేళ్లలో రూ.13,000 కోట్లు పెట్టుబడులు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ఓఎన్‌జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్)
ఎక్కడ : అసోం
క్విక్ రివ్యూ :
ఏమిటి : చమురు అన్వేషణ, ఉత్పత్తి నిమిత్తం ఐదేళ్లలో రూ.13,000 కోట్లు పెట్టుబడులు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ఓఎన్‌జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్)
ఎక్కడ : అసోం
Published date : 12 Sep 2019 04:01PM