Skip to main content

ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గం నిర్మాణ పనులు ప్రారంభం

జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్ సొరంగ మార్గం(జోజిలా టన్నెల్) నిర్మాణ పనులు అక్టోబర్ 15న ప్రారంభమయ్యాయి.
Edu news కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. 14.2 కి.మీ పొడవుండే ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది.
 
జోజిలా టన్నెల్ విశేషాలు...
  • ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) పోటీ సంస్థల కన్నా అత్యంత తక్కువగా కోట్ చేసి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఎంఈఐఎల్ రూ. 4,509.5 కోట్లకు బిడ్ వేసింది.
  • సుమారు 14.15 కి.మీ. పొడవుండే ఈ టన్నెల్‌ను షెడ్యూల్ ప్రకారం ఆరేళ్లలో పూర్తి చేయాలి.
  • ఈ టన్నెల్ పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్గా నిలుస్తుంది. శ్రీనగర్-లేహ్ మధ్య ప్రయాణ సమయం 3 గం.ల నుంచి 15 నిమిషాలకు తగ్గిపోతుంది.
  • శ్రీనగర్-కార్గిల్-లేహ్ జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తున ఉండటంతో ఇది వ్యూహాత్మక ప్రాజెక్టుగా మారింది.
  • సాధారణంగా శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్-లేహ్ మధ్య మార్గాన్ని మూసేయాల్సి ఉంటోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాది పొడవునా ప్రయాణాలకు వీలవుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జోజిలా పాస్ సొరంగ మార్గం(జోజిలా టన్నెల్) నిర్మాణ పనులు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : జోజిలా, లద్దాఖ్
ఎందుకు : శ్రీనగర్, లేహ్‌ను అనుసంధానించేందుకు
Published date : 16 Oct 2020 06:20PM

Photo Stories