ఆసియా రెజ్లింగ్ గ్రీకో విభాగంలో భారత్‌కు స్వర్ణం
Sakshi Education
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గ్రీకో రోమన్ శైలి విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక కాంస్యం లభించాయి.
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 18న మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ పసిడి పతకం నెగ్గగా... 55 కేజీల విభాగంలో అర్జున్ హలకుర్కి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో సునీల్ 5-0తో అజత్ సలిదినోవ్ (కిర్గిస్తాన్)పై గెలిచాడు. తద్వారా పప్పూ యాదవ్ (1993లో; 48 కేజీలు) తర్వాత ఆసియా రెజ్లింగ్ పోటీల్లో గ్రీకో రోమన్ శైలిలో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన రెజ్లర్‌గా సునీల్ గుర్తింపు పొందాడు. మరోవైపు 55 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కర్ణాటక రెజ్లర్ అర్జున్ 7-4తో డాంగ్‌హైక్ వన్ (దక్షిణ కొరియా)పై నెగ్గాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా రెజ్లింగ్ గ్రీకో విభాగంలో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : సునీల్ కుమార్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా రెజ్లింగ్ గ్రీకో విభాగంలో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : సునీల్ కుమార్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 19 Feb 2020 06:00PM