ఆసియా ఎల్‌పీజీ సదస్సులో ఎంఎం కుట్టీ
Sakshi Education
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 5న జరిగిన ఆసియా ఎల్‌పీజీ సదస్సులో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎంఎం కుట్టీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... 2.5 మిలియన్ టన్నుల ఎల్‌పీజీ(లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) వినియోగంతో భారత్ ప్రపంచ దేశాల్లో రెండో స్థానంలో ఉన్నట్టు చెప్పారు. 2025 నాటికి ఎల్‌పీజీ వినియోగం 30.3 మిలియన్ టన్నులకు, 2040 నాటికి 40.6 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వెల్లడించారు. ఎల్‌పీజీ వినియోగదారులు (తరచూ సిలిండర్ బుక్ చేసుకునేవారు) 2014-15లో 14.8 కోట్లుగా ఉంటే, 2017-18 నాటికి 22.4 కోట్లకు చేరినట్టు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎల్‌పీజీ డిమాండ్ 2025 నాటికి 34 శాతం పెరుగుతుందని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా ఎల్‌పీజీ సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎంఎం కుట్టీ
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా ఎల్‌పీజీ సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎంఎం కుట్టీ
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 07 Feb 2019 05:57PM