Skip to main content

ఆసియా బ్యాడ్మింటన్ నుంచి తప్పుకున్న భారత్

ఫిలిప్పీన్స్ లోని మనీలాలో జరగనున్న ఆసియా చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత మహిళల జట్టు తప్పుకుంది.
Current Affairsఫిలిప్పీన్స్ లోనూ కరోనా వైరస్’ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఫిబ్రవరి 7న ప్రకటించింది. 2020, 11 నుంచి 16 వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అస్మిత చలీహా, మాల్విక బన్సోడ్, పుల్లెల గాయత్రి తదితర యువ క్రీడాకారిణులతో కూడిన భారత జట్టు ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది.

మరోవైపు పురుషుల జట్టు మాత్రం చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుందని ‘బాయ్’ వెల్లడించింది. సాయిప్రణీత్, శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్య సేన్ తదితరులతో పూర్తి స్థాయి పురుషుల జట్టు టోర్నీ బరిలోకి దిగుతోంది.
Published date : 08 Feb 2020 06:03PM

Photo Stories