Skip to main content

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌లో స్వర్ణం గెలిచిన ఆటగాడు?

ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పురుషుల 91 కేజీల విభాగంలో భారత హెవీవెయిట్‌ బాక్సర్‌ సంజీత్‌కుమార్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
Current Affairs
యూఏఈలోని దుబాయ్‌లో మే 31న ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 91 కేజీల ఫైనల్లో సంజీత్‌ 4–1తో 2016 రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, మూడుసార్లు ఆసియా చాంపియన్‌ వాసిలీలెవిట్‌ (కజకిస్తాన్‌)పై సంచలన విజయం సాధించాడు. మరోవైపు 52 కేజీల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ అమిత్‌ పంఘాల్‌... 64 కేజీల విభాగంలో శివ థాపా రజత పతకాలను సొంతం చేసుకున్నారు.

ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు 15 పతకాలు వచ్చాయి. పురుషుల విభాగంలో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు... మహిళల విభాగంలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆసియా చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. 2019లో భారత్‌ అత్యధికంగా 13 పతకాలు సాధించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పురుషుల 91 కేజీల విభాగంలోస్వర్ణం గెలిచిన ఆటగాడు?
ఎప్పుడు : మే31
ఎవరు : భారత హెవీవెయిట్‌ బాక్సర్‌ సంజీత్‌కుమార్
ఎక్కడ :దుబాయ్‌, యూఏఈ
Published date : 02 Jun 2021 06:23PM

Photo Stories