Skip to main content

ఆసియా ఆన్‌లైన్‌ చెస్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు?

ఆసియా అండర్‌–14 ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు వి. ప్రణీత్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు.
Current Affairs
తొలి బోర్డుపై ఆడిన ప్రణీత్‌ మొత్తం తొమ్మిది గేముల్లో ఏడింటిలో గెలిచి, ఒక 'డ్రా' చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. 7.5 పాయింట్లతో ప్రణీత్‌ అగ్రస్థానంలో నిలిచి వ్యక్తిగత స్వర్ణాన్ని అందుకున్నాడు. మొత్తం 32 ఆసియా దేశాలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి.

హెచ్‌సీయూ–ఈఎస్‌ఐ ఒప్పందం
హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌తో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మార్చి 29న ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం... వచ్చే ఐదేళ్ల పాటు విద్యా, పరిశోధన కార్యక్రమాలు, టీచింగ్, ఫ్యాకల్టీ మార్పిడి, హెచ్‌సీయూ ప్రాంగణంలో ఆస్పత్రి అభివృద్ధికి సాయం వంటి అంశాలపై హెచ్‌సీయూ–ఈఎస్‌ఐలు పరస్పర సహకారం అందించుకోనున్నాయి.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
ఆసియా అండర్‌–14 ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు?
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : వి. ప్రణీత్‌
ఎక్కడ : వ్యక్తిగత విభాగంలో
Published date : 31 Mar 2021 11:15AM

Photo Stories