Skip to main content

అరుణోదయ రామారావు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు, సాంస్కృతిక కళాకారుడు అరుణోదయ రామారావు (65) గుండెపోటు కారణంగా మే 5న హైదరాబాద్‌లో కన్నుమూశారు.
1955 జూలై 1వ తేదీన కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో రామారావు జన్మించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో బీఏ వరకు చదువుకున్న రామారావు తండ్రితో కలసి పౌరాణిక నాటకాలు వేసేవారు. సీపీఐ(ఎంఎల్) నాయకుడు చండ్ర పుల్లారెడ్డి ప్రేరణతో విప్లవ ఉద్యమంలో చేరిన ఆయన విప్లవోద్యమంలో తన పాటలతో పజల్ని చైతన్యపరిచారు. ఖమ్మం జిల్లా పాపయ్యగూడెంకు చెందిన అరుణక్కను వివాహం చేసుకున్నారు. ప్రతి పాటకు సొంతం ట్యూన్ కట్టడంలో దిటై్టన రామారావు.. అన్నా అమరుడురా, అడవి ఏడ్చింది వంటి పాటలు పాడారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు కన్నుమూత
ఎప్పుడు : మే 5
ఎవరు : అరుణోదయ రామారావు (65)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 06 May 2019 04:59PM

Photo Stories