అరుణాచల్‌ప్రదేశ్‌లో అరుదైన సర్పం
Sakshi Education
అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లా ఈగల్‌నెస్ట్‌లోని అడవుల్లో అత్యంత అరుదైన జాతి సర్పం పిట్ వైపర్‌ను పరిశోధకులు గుర్తించారు.

ఈ విష సర్పం పిట్ వైపర్ జాతికే చెందినప్పటికీ.. ఈ జాతిలో ఇది కొత్త రకం అని పరిశోధకులు తెలిపారు. ఇది ముదురు ఎరుపు, గోధుమ రంగుల కలయికతో స్థానిక చెట్ల రంగులతో కలిసిపోయిందని పేర్కొన్నారు. ఈ సర్పాలకు తల భాగంలో రెండు వైపులా పిట్స్ (చిన్న రంధ్రాలు) ఉంటాయని వివరించారు. ఈ పరిశోధన వివరాలు రష్యన్ జర్నల్ ఆఫ్ హెర్పటాలజీ, మార్చి-ఏప్రిల్ సంచికలో ప్రచురితమయ్యాయి.
తాజాగా గుర్తించిన పిట్ వైపర్‌కు అరుణాచల్ ప్రదేశ్ పేరు మీదుగా ‘అరుణాచల్ పిట్ వైపర్’(ట్రైమెరెసురస్ అరుణాచలెనిస్) అని నామకరణం చేశారు. ఇలా ఓ సర్పానికి రాష్ట్రంపేరు కలుపుతూ పేరు పెట్టడం దేశంలో ఇదే తొలిసారి. సుమారు 70 ఏళ్ల కింద దేశంలో మలబార్ పిట్ వైపర్, హార్స్‌షూ పిట్ వైపర్, హంప్ నోస్‌డ్ పిట్ వైపర్, హిమాలయన్ అనే పిట్ వైపర్లను కనుగొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరుదైన జాతి సర్పం పిట్ వైపర్ గుర్తింపు
ఎప్పుడు : మే 11
ఎక్కడ : ఈగల్‌నెస్ట్ అడవులు, పశ్చిమ కమెంగ్ జిల్లా, అరుణాచల్‌ప్రదేశ్

Published date : 11 May 2019 05:26PM