అరుణాచల్ రాష్ట్ర పార్టీగా జేడీయూ
Sakshi Education
అరుణాచల్‌ప్రదేశ్‌లో జనతా దళ్ (యునెటైడ్)ను రాష్ట్ర పార్టీగా గుర్తిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గానూ జేడీయూ ఏడు స్థానాలు గెలుచుకుంది. అధికార పార్టీ బీజేపీకి 41 స్థానాలతో పూర్తి మెజారిటీ దక్కింది. బీహార్‌తోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌లలో జేడీయూ రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించిందని, ఆ పార్టీ ఇప్పుడు తన ఎన్నికల గుర్తు ‘బాణం’ను అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా ఉపయోగించుకోవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది. జేడీయూకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరుణాచల్ రాష్ట్ర పార్టీగా జేడీయూ
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : ఎన్నికల సంఘం
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరుణాచల్ రాష్ట్ర పార్టీగా జేడీయూ
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : ఎన్నికల సంఘం
Published date : 08 Jun 2019 06:26PM