అరుణ గ్రహంపై ల్యాండ్ అయిన నాసా రోవర్ పేరు?
Sakshi Education
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన అత్యాధునిక రోవర్ ‘పర్సవరన్స్’ ఫిబ్రవరి 18న అరుణ గ్రహ ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరుణ గ్రహంపై ల్యాండ్ అయిన నాసా రోవర్ పేరు?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : పర్సవరన్స్
ఎక్కడ : జెజెరొ బిలం, అంగారకుడు
ఎందుకు : అరుణ గ్రహంపై జీవనం ఆనవాళ్లను గుర్తించేందుకు
దీంతో మార్స్‌పై జీవం ఆనవాళ్లను నిర్ధారించేందుకు నమూనాల సేకరణకు మార్గం సుగమమైందని భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త, ప్రోగ్రామ్ ఫ్లైట్ కంట్రోలర్ డాక్టర్ స్వాతి మోహన్ ప్రకటించారు.
అట్లాస్-5 రాకెట్ ద్వారా...
- అరుణ గ్రహంపై జీవనం ఆనవాళ్లను గుర్తించే లక్ష్యంతో మార్స్ 2020 మిషన్‌ను నాసా చేపట్టింది.
- మిషన్‌లో భాగంగా ఫ్లోరిడాలోని కేప్‌కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 30న అట్లాస్-5 రాకెట్ ద్వారా 6 చక్రాలతో కారు పరిమాణంలో ఉన్న ‘పెర్సెవరెన్స్’ రోవర్‌ను నింగిలోకి ప్రయోగించింది.
- కెమెరాలు, మైక్రోఫోన్లు, లేజర్లు, డ్రిల్స్ వంటి అత్యాధునిక పరికరాలతో పాటు మినీ హెలికాప్టర్‌ను రోవర్లో అమర్చారు.
- ఈ రోవర్ సహాయంతో అరుణ గ్రహ నమూనాలను మళ్లీ భూమ్మీదకు తీసుకు రావాలని నాసా ప్రయత్నం చేస్తోంది.
- పర్సవరన్స్ రోవర్ 203 రోజుల పాటు, 47.2 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి సంక్లిష్ట జెజెరొ బిలం వద్ద అరుణ గ్రహంపై అడుగిడింది.
ఏడో రోవర్‌గా...
- పెర్సీ అనే ముద్దు పేరున్న పర్సవరన్స్ రోవర్ కారు సైజులో 1,026 కేజీల బరువుంటుంది. ప్లుటోనియంను ఇంధనంగా వాడుకుంటుంది.
- మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా పర్సవరన్స్ నిలిచింది.
- ఈ రోవర్‌ను రోబోటిక్ జియాలజిస్ట్, ఆో్టబ్రయాలజిస్ట్గా పరిగణించవచ్చు.
- అత్యాధునిక శాస్త్ర పరికరాలను, హై రెజొల్యూషన్ ఉన్న 3డీ కెమెరాలను, మైక్రో ఫోన్‌ను, 7, 8 అడుగుల లోతులోనూ నమూనాలను సేకరించగల సామర్థ్యాన్ని ఈ రోవర్లో పొందుపర్చారు.
- జెజెరొ బిలంలోని పురాతన నదీమార్గంలో రాళ్లు, మట్టి, ఇతర నమూనాలను ఈ రోవర్ సేకరిస్తుంది.
- పర్సవరన్స్ రోవర్ సేకరించి, ట్యూబ్స్‌లో సీల్ చేసి, అక్కడే భద్రపరిచిన నమూనాలను భూమికి తీసుకువచ్చేందుకు మరో రోవర్‌ను ప్రయోగిస్తారు.
భారతీయ సంతతి శాస్త్రవేత్త...
- మార్స్ 2020 మిషన్‌లో భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
- మార్స్ 2020 గెడైన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి స్వాతి ఆపరేషన్స్ లీడ్‌గా నాయకత్వం వహిస్తున్నారు.
- మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు
- భారత్ నుంచి ఏడాది వయసులో స్వాతి మోహన్ తన తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరుణ గ్రహంపై ల్యాండ్ అయిన నాసా రోవర్ పేరు?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : పర్సవరన్స్
ఎక్కడ : జెజెరొ బిలం, అంగారకుడు
ఎందుకు : అరుణ గ్రహంపై జీవనం ఆనవాళ్లను గుర్తించేందుకు
Published date : 20 Feb 2021 05:57PM