Skip to main content

అరుదుగా లభించే తిమింగలం వాంతిని ఏ పేరుతో పిలుస్తారు?

సముద్రాల్లో అత్యంత అరుదుగా లభించే తిమింగలం వాంతి ‘‘అంబర్‌గ్రిస్‌’’ కర్ణాటకలో అరేబియా తీరాన లభించింది.
Current Affairs
ఎంతో విలువైన ముడి సుగంధ ద్రవ్యంగా దీనికి పేరుంది. ఉత్తర కన్నడ జిల్లా మురుడేశ్వర్‌ బీచ్‌లో జాలరి జనార్దనకు ఇది కనిపించింది. 250 గ్రాముల బరువున్న ఈ పదార్థాన్ని ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత వన్యప్రాణి చట్టాల ప్రకారం ఇది రక్షిత పదార్థం. అంతర్జాతీయ మార్కెట్లో కిలో అంబర్‌గ్రిస్‌ రూ.కోటి వరకు ధర పలుకుతోంది.

స్పెర్మ్‌ వేల్‌ నుంచి...
స్పెర్మ్‌ వేల్‌ అనే ఒక రకం తిమింగలం... స్క్విడ్‌లు, కటిల్‌ఫిష్‌ అనే సముద్ర జీవులను తిన్నప్పుడు వాటి ఎముకలు జీర్ణకోశంలో అరగకుండా ఉండి కొంతకాలానికి గడ్డకడతాయి. కొన్ని రసాయన చర్యల అనంతరం... తిమింగలం దాన్ని బయటకు ఉమ్మేస్తుంది. ఇది కొన్నిసార్లు 15 నుంచి 20 కిలోల వరకు ఉంటుంది. ఒక రకమైన సువాసన వెదజల్లే ఈ పదార్థాన్ని అమెరికా, యూరప్‌ దేశాల్లో ఖరీదైన పరిమళాల తయారీలో ఉపయోగిస్తారు. మురుడేశ్వర్‌ ప్రాంతంలో అంబర్‌గ్రిస్‌ కనిపించడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి స్పెర్మ్‌ వేల్స్‌ ఈ ప్రాంతం సమీపంలో సంచరిస్తుంటాయని అంచనా వేస్తున్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : సముద్రాల్లో అత్యంత అరుదుగా లభించే తిమింగలం వాంతి ‘‘అంబర్‌గ్రిస్‌’’ లభ్యం
ఎప్పుడు : ఏప్రిల్‌ 26
ఎక్కడ : మురుడేశ్వర్‌ బీచ్‌, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక
ఎందుకు:అంబర్‌గ్రిస్‌నుఖరీదైన పరిమళాల తయారీలో ఉపయోగిస్తారు
Published date : 28 Apr 2021 11:52AM

Photo Stories