ఆరు నెలల పాటు నాడా గుర్తింపు రద్దు
Sakshi Education
భారత క్రీడాకారులకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) గుర్తింపును ఆరు నెలల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) వెల్లడించింది.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ ల్యాబొరేటరీస్ (ఐఎస్‌ఎల్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాడాకు చెందిన ల్యాబ్ (ఎన్‌డీటీఎల్)లో సౌకర్యాలు లేనందునే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆగస్టు 23న తెలిపింది. 2019, ఆగస్టు 20 నుంచి ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని పేర్కొంది.
ఆరు నెలల రద్దు నిర్ణయంతో శాంపిల్‌ను తీసుకునే అవకాశం మాత్రమే నాడాకు ఉంది. తాజా చర్యపై కోర్ట్ ఆఫ్ ఆర్బిటేషన్ ఫర్ స్పోర్‌ట్స (సీఏఎస్)లో 21 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఎన్‌డీటీఎల్‌కు ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆరు నెలల పాటు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) గుర్తింపు రద్దు
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)
ఎందుకు : నాడాకు చెందిన ల్యాబ్ (ఎన్‌డీటీఎల్)లో సరైన సౌకర్యాలు లేనందున

Published date : 24 Aug 2019 05:28PM