Skip to main content

ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ నరసింహం కన్నుమూత

ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ మైదవోలు నరసింహం (94) కన్నుమూశారు.
Current Affairs కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో ఏప్రిల్‌ 20న తుదిశ్వాస విడిచారు. నరసింహం భారతీయ రిజర్వు బ్యాంకుకు 13వ గవర్నర్‌గా ఏడునెలల పాటు పనిచేశారు. ఆర్థిక రంగంలో దేశానికి విశేష సేవలందించిన ఆయన భారతీయ బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలకు పితామహుడిగా గుర్తింపు పొందారు.

నరసింహం నేపథ్యం...
  • మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు మనవడైన నరసింహం... 1927, జూన్‌ 3న గుంటూరులో జన్మించారు.
  • మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ, కేంబ్రిడ్జిలోని సెయింట్‌ జాన్స్‌ కళాశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం రిజర్వు బ్యాంకు అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
  • ఆర్‌బీఐలో ఉద్యోగిగా మొదలై అదే బ్యాంకు గవర్నర్‌గా నియమితులైన ఏకైక వ్యక్తి నరసింహమే.
  • ప్రపంచ బ్యాంకులో భారత ప్రభుత్వం తరఫున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గానూ ఆయన సేవలందించారు.
  • ఆర్థిక రంగానికి చేసిన సేవలకుగాను 2000 ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు : మైదవోలు నరసింహం (94)
ఎక్కడ : హైదరాబాద్‌
ఎందుకు : అనారోగ్యం కారణంగా...
Published date : 21 Apr 2021 07:22PM

Photo Stories