Skip to main content

అర్జున ఎంకే-1ఏ యుద్ధ ట్యాంక్‌ను తయారు చేసిన సంస్థ?

డీఆర్‌డీఓ దేశీయంగా తయారు చేసిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంక్(ఎంకే-1ఏ)ను భారతీయ సైన్యానికి ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు.
Current Affairs

చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 14న జరిగిన కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.

ప్రధాని తమిళనాడు పర్యటన-ముఖ్యాంశాలు...

  • చెన్నై ఆవడిలోని ఆర్మీ ఫ్యాక్టరీలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో 71 సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న అర్జున యుద్ధ ట్యాంకర్ను భారత ఆర్మీకి అందించారు.
  • తమిళ కవి సుబ్రమణ్య భారతియార్ రాసిన ‘ఆయుధం సెయ్‌వోం...(ఆయుధం తయారు చేద్దాం)’ అన్న కవితను గుర్తు చేస్తూ, డిఫెన్స్ కారిడార్‌కు తమిళనాడు ఎంపికై నట్టు తెలిపారు.
  • చెన్నై వాషర్‌మెన్ పేట-విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.3,770 కోట్లతో వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.
  • రూ.293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్-అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్‌లో, రూ.423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం-తంజావూరు - తిరువారూర్ మార్గంలో రైలు సేవలకు జెండా ఊపారు.
  • తంజావూరు, పుదుకోటై్టలకు సాగు నీరు అందించడం లక్ష్యంగా రూ. 2,640 కోట్లతో చేపట్టనున్న కళ్లనై కాలువ పునరుద్ధరణ పనులకు, రూ.1000 కోట్లతో చెంగల్పట్టు జిల్లా తయ్యూరు సమీపంలో 163 ఎకరాల్లో నిర్మించనున్న ఐఐటీ డిస్కవరీ క్యాంపస్ పనులకు శంకుస్థాపన చేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అర్జున యుద్ధ ట్యాంకర్‌లను భారతీయ సైన్యానికి అప్పగింత
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు
Published date : 15 Feb 2021 05:58PM

Photo Stories