అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ బాక్సర్ కన్నుమూత
Sakshi Education
అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ బాక్సర్ డింకో సింగ్(42) కన్నుమూశారు.
సుదీర్ఘ కాలంగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలో జూన్ 10న తుదిశ్వాస విడిచారు.చిరు ప్రాయంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన డింకో సింగ్ అనాథ శరణాలయంలో పెరిగాడు.పదేళ్ల ప్రాయంలోనే జాతీయ సబ్–జూనియర్ పోటీల్లో బాక్సింగ్‌లో విజేతగా నిలిచాడు.తర్వాత జరిగిన జాతీయ పోటీల్లో ఎదురు లేని చాంపియన్‌గా ఎదిగాడు.1997లో అంతర్జాతీయ బాక్సింగ్‌లో అరంగేట్రం చేసిన డింకో ఆ మరుసటి ఏడాదే బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో (1998)లో54 కేజీల బాంటమ్ వెయిట్ కేటగిరీలో హేమాహేమీలను, ఒలింపిక్ మెడలిస్టులను మట్టి కరిపించి స్వర్ణ పతకం నెగ్గాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించిన డింకోను1998లో ‘అర్జున’ అవార్డుతో, 2013లో ‘పద్మశ్రీ’తో భారత ప్రభుత్వంసత్కరించింది. చనిపోయే సమయానికి అతను భారత నావికాదళంలో ‘ఎంసీపీఓ’ హోదాలో పని చేస్తున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ బాక్సర్ కన్నుమూత
ఎప్పుడు :జూన్ 10
ఎవరు : డింకో సింగ్(42)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు:కాలేయ క్యాన్సర్ కారణంగా...
క్విక్ రివ్యూ :
ఏమిటి : అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ బాక్సర్ కన్నుమూత
ఎప్పుడు :జూన్ 10
ఎవరు : డింకో సింగ్(42)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు:కాలేయ క్యాన్సర్ కారణంగా...
Published date : 11 Jun 2021 06:41PM