Skip to main content

అరిజ్ ఖాన్కు ఉరి శిక్ష

2008 నాటి బాట్లాహౌస్ ఎన్కౌంటర్ కేసులో అరిజ్ ఖాన్కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు ఇన్స్పెక్టర్ మోహన్చంద్ శర్మను చంపినందుకు అతడికి ఈ శిక్షను ఖరారు చేసింది.
Current Affairsఅరిజ్‌ చేసిన నేరం గరిష్ట శిక్ష విధించేందుకు వీలు కల్పించే అత్యంత అరుదైన కేటగిరీలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. అతడిని మరణించే వరకూ ఉరికి వేలాడదీయాలని అదనపు సెషన్స్‌ జడ్జి సందీప్‌ యాదవ్‌ తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో అరిజ్‌ ఖాన్‌కు మొత్తం రూ.11 లక్షల జరిమానా విధించారు. రూ.10 లక్షలను తక్షణమే మోహన్‌చంద్‌ శర్మ కుటుంబానికి అందజేయాలని ఆదేశించింది.

కేసు వివ‌రాలు..
  •  2008 సెప్టెంబర్‌ 13: ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు. 39 మంది మృతి, 159 మందికి గాయాలు.
  •  2008 సెప్టెంబర్‌ 19: దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్‌లో ఉన్న బాట్లా హౌస్‌లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు.
  •  2009 జూలై 3: అరిజ్‌ ఖాన్, షాజాద్‌ అహ్మద్‌ను నిందితులుగా ప్రకటించిన న్యాయస్థానం.
  •  2010 ఫిబ్రవరి 2: యూపీలోని లక్నోలో షాజాద్‌ అహ్మద్‌ అరెస్టు.
  •  2010 అక్టోబర్‌ 1: ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ.
  •  2013 జూలై 30: షాజాద్‌ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు.
  •  2018 ఫిబ్రవరి 14: అరిజ్‌ ఖాన్‌ అరెస్టు.
  •  2021 మార్చి 8: హత్య, ఇతర నేరాల్లో అరిజ్‌ ఖాన్‌ దోషిగా గుర్తింపు.
  •  2021 మార్చి 15: అరిజ్‌కు మరణ శిక్ష

క్విక్‌ రివ్యూ:
ఏమిటి :
అరిజ్‌ ఖాన్‌కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : అరిజ్‌ ఖాన్‌
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌చంద్‌ శర్మను చంపినందుకు
Published date : 16 Mar 2021 05:37PM

Photo Stories