Skip to main content

ఆర్‌ఏఎఫ్ స్థావరం ఏర్పాటుకు హోం మంత్రి ఎక్కడ శంకుస్థాపన చేశారు?

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా బుళ్లాపురలో ఆర్‌ఏఎఫ్ (ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) నూతన స్థావరం ఏర్పాటు కానుంది.
Current Affairs
ఈ ఆర్‌ఏఎఫ్ క్యాంప్‌కి జనవరి 16న కేంద్ర హోం మంత్రి అమిత్ షా భూమిపూజ చేశారు. సుమారు రూ.1,500 కోట్ల వ్యయంతో ఈ ఆర్‌ఏఎఫ్ 97వ బెటాలియన్ క్యాంప్ ఏర్పాటు కానుంది. ఇందులో సిబ్బందికి శిక్షణనివ్వడంతో పాటు క్వార్టర్లు, ఆస్పత్రులు అందుబాటులో ఉంటాయి. దాదాపు 50 ఎకరాల్లో నిర్మిస్తారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనేదిసీఆర్‌పీఎఫ్కి చెందిన ఒక విభాగం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆర్‌ఏఎఫ్ (ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) నూతన స్థావరం ఏర్పాటుశంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఎక్కడ : బుళ్లాపుర, భద్రావతి తాలూకా, శివమొగ్గ జిల్లా, కర్ణాటక
Published date : 20 Jan 2021 01:37PM

Photo Stories