Skip to main content

ఆర్‌బీఐ ఎడ్యుకేషన్‌ డాక్యుమెంట్‌ విడుదల

ప్రజలను ఆర్థికంగా చైతన్యవంతులను చేసేందుకు.. ఆర్థిక విద్యను ప్రోత్సహించేందుకు ఐదు ప్రధాన అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ముందుకు వచ్చింది.
Current Affairs
ఈ మేరకు నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషన్‌ 2020– 2025’ (ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈ) పేరుతో ఆర్‌బీఐ ఆగస్టు 20న డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఆర్‌బీఐకి చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీఎఫ్‌ఈ) సంస్థ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈ 2020–25ని రూపొందించింది.

ఐదు ప్రధాన అంశాలు...
తన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న ఐదు ప్రధాన అంశాలు.. కంటెంట్‌ (విషయాలు), కెపాసిటీ (సామర్థ్యం), కమ్యూనిటీ (సంఘం), కమ్యూనికేషన్‌ (సమాచారం), కొలాబరేషన్‌ (సహకారం)ను ప్రధానంగా ఆర్‌బీఐ ప్రస్తావించింది. దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం అన్నది కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆర్థిక నియంత్రణ సంస్థలు ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్‌ఆర్డీఏ ప్రధాన ఎజెండాగా ఉంది. దేశ ప్రజ ల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు, సాధికార భారత్‌ కోసం ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర సంస్థలు వేటికవే విడిగా కాకుండా, కలసికట్టుగా (బహుళ భాగస్వాములతో) పనిచేసే విధానం అవసరమని సూచించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషన్‌ 2020– 2025’ (ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈ) డాక్యుమెంట్ విడుదల
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు :ప్రజలను ఆర్థికంగా చైతన్యవంతులను చేసేందుకు.. ఆర్థిక విద్యను ప్రోత్సహించేందుకు
Published date : 24 Aug 2020 08:20PM

Photo Stories