Skip to main content

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అధికారి?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ బీపీ కనుంగో ఏప్రిల్‌ 2న పదవీ విరమణ చేశారు.
Current Affairs

కనూంగో ఏడాది పదవీకాలం పొడిగింపు ఏప్రిల్‌ 2వ తేదీ నాటికి ముగిసింది. 1982లో కనుంగో ఆర్‌బీఐలో చేరారు. నగదు నిర్వహణ, విదేశీ పెట్టుబడులు, నిర్వహణ, పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి పలు కీలక విభాగాల్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఉర్జిత్‌ పటేల్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో 2017 ఏప్రిల్‌లో డిప్యూటీ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2020 ఏప్రిల్‌ 2తో ఆయన మూడేళ్ల పదవీ కాలం ముగిసింది. అయితే ఆయన పదవీకాలాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా...
స్థాపన:
1935, ఏప్రిల్‌ 1
ప్రధాన కార్యాలయం: ముంబై
ప్రస్తుత గవర్నర్‌: శక్తికాంత దాస్‌
ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు: 4.00 శాతం
ప్రస్తుతం ఆర్‌బీఐ రివర్స్‌ రెపో రేటు: 3.35 శాతం

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా వైదొలిగిన అధికారి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 2
ఎవరు : బీపీ కనుంగో
ఎందుకు : పదవీ కాలం ముగియడంతో
Published date : 03 Apr 2021 05:44PM

Photo Stories