Daily Current Affairs in Telugu: ఏప్రిల్ 3, 2023 కరెంట్ అఫైర్స్
Deadly Storms And Tornadoes: అమెరికాలో టోర్నడో బీభత్సం..
అమెరికాలో ఇటీవల మిసిసిపి, పరిసర ప్రాంతాలను అల్లాడించిన ప్రాణాంతక టోర్నడో మార్చి 31న దక్షిణ, పశ్చిమమధ్య ప్రాంతాలను వణికించింది. అర్కన్సాస్, ఇల్లినాయీతో పాటు ఇండియానా, అలబామా రాష్ట్రాల్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. గంటకు 100 కిలోమీటర్ల పై చిలుకు వేగంతో వచ్చి పడ్డ పెనుగాలుల ధాటికి ఎక్కడ చూసినా నేలమట్టమైన ఇళ్లు, షాపింగ్ సెంటర్లు తదితర భవనాలతో పరిస్థితి భయానకంగా మారింది. టోర్నడో బారిన పడి 18 మందికి పైగా మరణించగా డజన్ల మంది గాయపడ్డారు.
అయోవా, ఓక్లహామా రాష్ట్రాల్లోనూ భారీ నష్టం సంభవించింది. దాదాపు 3 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. పెనుగాలుల కారణంగా పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యవసర, విపత్తు స్పందన బృందాలు రంగంలోకి దిగాయి. వచ్చే వారం మరికొన్ని భారీ తుపాన్లు, టోర్నడోలు రావచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది.
Donald Trump: ట్రంప్ అరెస్టవవుతాడా.. ట్రంప్‌పైనున్న కేసు ఏమిటి..?
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
ప్రధాని మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలతో ఎంపీగా అనర్హత వేటు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు పడింది . మహాభారతంలోని కౌరవులను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో పోలుస్తూ రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరు కేసు వేశారు. గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కోర్టులో కమల్ భదౌరియా అనే వ్యక్తి పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసు ఏప్రిల్ 12వ తేదీన విచారణకు రానుంది. కమల్ న్యాయవాది చెప్పిన ప్రకారం.. ఈ జనవరి తొమ్మిదో తేదీన భారత్ జోడో యాత్రలో భాగంగా హరియాణాలోని అంబాలా పట్టణంలోని ఒక కూడలిలో రాహుల్ ప్రసంగించారు.
Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు.. రాహుల్‌పై ఉన్న కేసు ఏమిటీ?
‘ కౌరవులు ఎవరో మీకు తెలుసా ? మొదట మీకు 21 శతాబ్దపు కౌరవుల గురించి వివరిస్తా. వాళ్లంతా ఖాకీ రంగు నిక్కర్లు వేసుకుంటారు. చేతిలో లాఠీ పట్టుకుని ‘శాఖ’లు నిర్వహిస్తారు. భారత్లోని ఇద్దరు, ముగ్గురు అపర కుబేరులు వీరికి మద్దతుగా నిలుస్తున్నారు’ అని రాహుల్ ప్రసంగించారని తన పిటిషన్లో కమల్ పేర్కొన్నారు. ‘21వ శతాబ్దంలో కౌరవులు ఇంకా ఉన్నారు అంటే అది ఆర్ఎస్ఎస్ సభ్యులే’ అని ప్రసంగించి ఆర్ఎస్ఎస్ పరువుకు రాహుల్ తీవ్ర భంగం కల్గించారని ఆరోపించారు. ‘మోదీ అని ఇంటిపేరు ఉన్నవాళ్లంతా దొంగలే’ అని వ్యాఖ్యానించారన్న కేసులో దోషిగా తేలడంతో సూరత్ కోర్టు రాహుల్కు ఇప్పటికే రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. ఎగువ కోర్టులో అప్పీల్కు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును తాత్కాలిక నిలుపుదల చేసిన విషయం తెల్సిందే.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్‌సభ సభ్యత్వం రద్దు
Reusable Launch Vehicle: ఆర్ఎల్వీ పరీక్ష విజయవంతం
గగన్యాన్ ప్రాజెక్టు పరిశోధనా పరీక్షల్లో భాగంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటనామస్ ల్యాండింగ్ మిషన్(ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్) రాకెట్ ప్రయోగ పరీక్షలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఏప్రిల్ 2వ తేదీ విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కుందాపురం సమీపంలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్)లో ఈ పరీక్ష చేపట్టారు. భారత వైమానిక దళానికి సంబంధించిన చినోక్ అనే హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ రాకెట్ను ఉదయం 7.10 గంటలకు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్లోని మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్ కమాండ్ ఆధారంగా రాకెట్ తిరిగి 7.40 గంటలకు భూమిపై నిర్దేశిత ప్రాంతంలో క్షేమంగా ల్యాండయ్యింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
ముందస్తుగా సిద్ధం చేసి రూపొందించిన నేవిగేషన్, గైడెన్స్, నియంత్రణ వ్యవస్థల సహాయంతో ఈ మానవ రహిత లాంచింగ్ వాహనం ఎలాంటి ఆటంకం లేకుండా భూమిపైకి చేరింది. ఈ ప్రయోగంలో ఇస్రోతోపాటు డీఆర్డీవో, భారత వైమానిక దళం కూడా భాగస్వామిగా మారింది. ప్రపంచంలోనే మొదటిసారిగా హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ లాంటి రాకెట్ను ఆకాశంలో వదిలి, తిరిగి విజయవంతంగా భూమి మీదకు చేర్చిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆర్ఎల్వీ ప్రాజెక్టు నిర్వహణ బృందాన్ని ఆయన అభినందించారు. కాగా 2016 మే 23న ఆర్ఎల్వీ–టీడీ పేరుతో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. ఈ నేపథ్యంలో 2024 ఆఖరుకు గగన్యాన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.
LVM3 Rocket: వన్‌వెబ్ ఇండియా–2 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి 36 సమాచార ఉపగ్రహాలు
గూగుల్‌లో సౌకర్యాలు కట్..!
గూగుల్‌లో ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గెంతేస్తారు. అక్కడిచ్చే జీతం కంటే ఇతర సౌకర్యాల కోసం ఉద్యోగులు ఎగబడతారు. ఒక్కసారి ఆఫీసులోకి అడుగుపెడితే అన్నీ ఫ్రీయే. టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌తో పాటు స్నాక్స్, లాండ్రీ సర్వీసు, మసాజ్ పార్లర్‌లే కాదు, తరచుగా కంపెనీ లంచ్‌లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ సౌకర్యాలకి గూగుల్ కోత విధించింది. ఇక నుంచి స్నాక్స్, లంచ్‌లు, లాండ్రీ, మసాజ్ సర్వీసులు ఆఫీసులో ఉండవని ప్రకటించింది. ఇలా ఆదా చేసిన డబ్బుల్ని మరిన్ని కీలకమైన పరిశోధనలకు ఖర్చు పెడతామని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరట్ చెప్పారు. ఇప్పటికే ఈ ఏడాది 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామన్న గూగుల్ ఇప్పుడు ఇలా సౌకర్యాలు కూడా కట్ చేస్తూ ఉండడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది.
UPI Payments: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. కానీ వారికి మాత్రం..
Holidays to Love: చైనా కాలేజీల్లో ‘లవ్ బ్రేక్’
వేసవి సెలవులు, పండగ సెలవులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే కాలేజీలకు సెలవులు ఇవ్వడం సర్వసాధారణం. కానీ చైనా ప్రభుత్వం తమ దేశంలో యువతీయువకులను ప్రేమించుకోండి అంటూ ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలేందుకు ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ఇస్తోంది. చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆ దేశంలో ఏర్పడిన జనాభా సంక్షోభమే కారణం. చైనాలో జననాలు, వివాహాల శాతాలు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. గడచిన ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనా జనాభా గత ఏడాది తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ దేశం దిద్దుబాటు చర్యలకు దిగింది. అక్కడి వివిధ కార్పొరేట్ సంస్థలు సైతం నెల రోజుల పాటు వివాహ సెలవుల్ని మంజూరు చేస్తున్నాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
దశాబ్దాల తరబడి అయితే ఒక్కరు లేదంటే వద్దు అన్న ఆంక్షల చట్రంలో గడిపిన చైనీయులు ఇప్పుడు ప్రేమ, పెళ్లి, పిల్లలు అన్న పదాల పట్ల విముఖంగా ఉన్నారు. అందుకే నేటి తరంలో కాస్తయినా ప్రేమ భావనలు మొలకెత్తడానికి కొన్ని కళాశాలలు ఈ కొత్త ఆలోచన చేశాయి. ఏప్రిల్ అంటే వసంత కాలం. ఈ కాలంలో చెట్లన్నీ విరబూసి వాతావరణం అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. స్ప్రింగ్ సీజన్‌ని ఎంజాయ్ చేయడంతో పాటు లవ్‌లో కూడా పడండి అంటూ ఒక వారం రోజులు సెలవులు ప్రకటించాయి చైనా కాలేజీలు. ‘‘ప్రకృతిని ప్రేమించండి. ప్రేమిస్తే ఎంత కొత్తగా వింతగా ఉంటుందో అనుభూతి చెందండి. లైప్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి’’ అని యువతకి ప్రేమించుకోవడానికి కొన్ని కాలేజీలు హాలీడేస్ ప్రకటించాయి. అలా ప్రేమలో పడ్డ జంటలైనా ఒక్కటై పిల్లల్ని కంటారని ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది.
Xi Jinping: చైనా అధ్యక్షుడిగా, సీఎంసీ చైర్మన్‌గా మూడోసారి ఎన్నికైన జిన్‌పింగ్
ChatGPT: చాట్‌జీపీటీపై నిషేధం.. డేటా లీక్ చేసినందుకే..!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. కఠినమైన యూరోపియన్ యూనియన్ డేటా పరిరక్షణ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. చాట్‌జీపీటీపై ఇలాంటి చర్య తీసుకున్న తొలి దేశం ఇటలీయే.
కారణం ఇదే..
యూజర్ల సంభాషణలు, చందాదారుల చెల్లింపులకు సంబంధించిన డేటా చాట్‌జీపీటీ ద్వారా లీకైందని ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంది. అందుకే దాన్ని బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. డేటా గోప్యతను చాట్‌జీపీటీ పూర్తిస్థాయిలో గౌరవించేదాకా నిషేధం కొనసాగుతుందని తెలిపింది. దాని మాతృసంస్థ ఓపెన్‌ఏఐ ఎలాంటి చట్టపరమైన ఆధారమూ లేకుండానే భారీ పరిమాణంలో వ్యక్తిగత డేటాను సేకరించి ప్రాసెస్ చేస్తోందంటూ విస్మయం వ్యక్తం చేసింది.
చాట్ జీపీటీకి గూగుల్ షాక్....బార్డ్‌తో చాట్‌జీపీటీకి చెక్..?
‘‘పైగా డేటా సేకరిస్తున్న యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫై చేయడం లేదు. పైగా చాట్‌జీపీటీ కొన్నిసార్లు వ్యక్తులను గురించిన తప్పుడు సమాచారాన్ని పుట్టించి స్టోర్ చేస్తోంది. అంతేకాదు, యూజర్ల వయసును నిర్ధారించుకునే వ్యవస్థేదీ చాట్‌జీపీటీలో లేదు. కనుక అభ్యంతరకర కంటెంట్ పిల్లల కంటపడే రిసు్కంది. పైగా 13 ఏళ్ల కంటే తక్కువ వయసు చిన్నారుల కోసం ఫిల్టర్లేవీ లేకపోవడం తీవ్ర అభ్యంతరకరం’’ అంటూ ఆక్షేపించింది.
చాట్‌జీపీటీలో సాంకేతిక సమస్యలు కొత్తేమీ కాదు ఇతర యూజర్ల సబ్జెక్ట్ లైన్లు, చాట్ హిస్టరీ తదితరాలను కొందరు యూజర్లు చూసేందుకు వీలు కలుగుతుండటంతో సమస్యను సరిచేసేందుకు చాట్‌జీపీటీని కొంతకాలం ఆఫ్‌లైన్ చేస్తున్నట్టు మార్చి 20న ఓపెన్‌ఏఐ ప్రకటించడం తెలిసిందే. 1.2 శాతం మంది యూజర్లకు ఈ యాక్సెస్ లభించినట్టు విచారణలో తేలిందని సంస్థ పేర్కొంది.
ChatGPT: అనుకున్నదే అయ్యింది... ఉద్యోగాలకు ఎసరు పెట్టిన చాట్ బోట్స్.. నిరుద్యోగులకు ఇక నిద్రలేని రాత్రులే
20 రోజుల్లో నివేదించాలి
నిషేధం నేపథ్యంలో యూజర్ల డేటా గోప్యత పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నదీ ఓపెన్‌ఏఐ నివేదించాల్సి ఉంటుంది. లేదంటే 2.2 కోట్ల డాలర్లు/మొత్తం వార్షికాదాయంలో 4 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో అలసత్వానికి కారణమవుతుందంటూ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు ఇప్పటికే చాట్‌జీపీటీని నిషేధించాయి.
World's Youngest Author: గిన్నిస్ రికార్డు.. నాలుగేళ్లకే పుస్తకాన్ని రాసి ప్రచురించిన బాలుడు
పిట్ట కొంచెం కూత ఘనం అని సామెత. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఈ నాలుగేళ్ల బాలుడిని చూస్తే పిట్ట కొంచెం రాత ఘనం అని సామెత మార్చుకోవాలి. అబుధాబిలో ఉండే సయీద్ రషీద్ అనే నాలుగేళ్ల వయసున్న బాలుడు ఒక పుస్తకాన్ని రాయడంతో పాటు దానిని ప్రచురించి గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కాడు. ఒక ఏనుగుకి, ఎలుగుబంటికి మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని కథగా మలిచాడు. ఆ పుస్తకం వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసు్కడిగా సయీద్ రికార్డులకెక్కినట్టుగా ప్రకటించారు. సయీద్ ఈ పుస్తకం రాయడానికి ఎనిమిదేళ్ల వయసున్న అతని అక్క అయిధాబీ స్ఫూర్తిగా నిలిచిందని ఖలీజా టైమ్స్ వెల్లడించింది. ఇప్పటికే అయిధాబీ ఒక ప్రచురణ సంస్థను కూడా నడుపుతూ రికార్డులు సాధించింది. మొత్తమ్మీద ఫ్యామిలీలో అందరికీ పుస్తకాలంటే ఎంతో ఇష్టం కావడంతో ఈ అరుదైన ఘనత సాధించగలిగాడు.
Richard Verma: అమెరికా ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి
Virat Kohli: ఐపీఎల్‌లో కొహ్లి రికార్డు.. తొలి భారతీయ క్రికెటర్‌గా..
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఏప్రిల్ 2వ తేదీ ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్‌గా దిగిన కింగ్ కోహ్లి 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీతో మెరిసిన కోహ్లికి 50 ప్లస్ స్కోరు చేయడం 50వ సారి. ఐపీఎల్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లి కంటే ముందు డేవిడ్ వార్నర్ 60 హాఫ్ సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 49, ఏబీ డివిలియర్స్ 43, రోహిత్ శర్మ 41 ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌తో తరువాతి స్థానాల్లో ఉన్నారు.
అంతేకాదు ఆర్‌సీబీ ఓపెనర్‌గా కొహ్లి మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఇక కోహ్లి ఓవరాల్‌గా 224 మ్యాచ్‌ల్లో 6695 పరుగులు సాధించాడు.