Daily Current Affairs in Telugu: ఏప్రిల్ 18, 2023 కరెంట్ అఫైర్స్
Bhavanapadu Port: భావనపాడు పోర్టు పేరు మార్పు
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర పెట్టుబడులు మరియు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (పోర్ట్స్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ) కరికల్ వలవెన్ వెల్లడించారు. పోర్టు కోసం గ్రామాన్ని, భూములను త్యాగం చేశామని, పోర్టు పేరు తమ గ్రామం పేరు మీద ఉండాలని మూలపేట, విష్ణుచక్రం గ్రామవాసులు గతంలో నిర్వహించిన వివిధ సమావేశాల్లో ఆ జిల్లా కలెక్టర్, అధికారులకు విన్నవించారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చుతున్నట్లు వలెవన్ తెలిపారు.
Andhra Pradesh: కోనసీమ జిల్లా పేరు మార్పు.. కొత్త పేరు ఇదే..?
Sundar Pichai: కృత్రిమ మేధను తలచుకుంటే నిద్రలేని రాత్రులే.. సుందర్ పిచాయ్
కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి తలచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పిచాయ్ చెప్పారు. ఈ టెక్నాలజీ ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించుకొనేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఐతో అసత్య సమాచారాన్ని సృష్టించే వీలుందని, ఇది సమాజానికి ప్రమాదకరమని అన్నారు. అణ్వాయుధాలను నియంత్రిస్తున్న తరహాలోనే ఏఐని నియంత్రించడానికి ఒక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు.
GST New Rule: మే 1 నుంచి జీఎస్టీ కొత్త రూల్.. ఇకపై అలా కుదరదు!
Same-Sex Marriage: స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించలేం.. సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా తేల్చిచెప్పింది. ఆడ, మగ మధ్య జరిగే వివాహాలకు మాత్రమే వ్యవస్థ నుంచి గుర్తింపు లభిస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వివాహ వ్యవస్థతో సమానంగా స్వలింగ వివాహాలను గుర్తించలేమని స్పష్టం చేసింది. ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు స్త్రీల మధ్య జరిగే పెళ్లిళ్లను చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ల విచారణార్హతను ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. వివాహాలకు చట్టబద్ధత కల్పించడం అనేది చట్టసభలకు సంబంధించిన వ్యవహారమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ అంశాన్ని చట్టసభలకే వదిలేయాలని, న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని కోరారు.
AIIMS: ఎయిమ్స్–గువాహటి జాతికి అంకితం
స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలా? లేదా? అనేది చట్టసభలే నిర్ణయిస్తాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన పిటిషన్ దాఖలు చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం అనేది వ్యక్తిగత చట్టాలు, సామాజిక ఆమోదం పొందిన విలువల మధ్య ఉన్న సున్నితమైన సమతూకాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 18న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (05-11 మార్చి 2023)
రష్యా జర్నలిస్టుకు పాతికేళ్ల జైలు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తప్పుబట్టినందుకు వ్లాదిమిర్ కారా–ముర్జా జూనియర్(41) అనే జర్నలిస్టు, రాజకీయ కార్యకర్త జైలు పాలయ్యాడు. దేశద్రోహం నేరకింద రష్యా కోర్టు ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సైనిక చర్యను బహిరంగంగా విమర్శిస్తున్న ఆయనపై ఇప్పటికే రెండుసార్లు విషప్రయోగం జరిగింది. జైలుశిక్షను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి.
Ambedkar Statue: దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం.. 125 అడుగుల విగ్రహ రూపకర్త, విగ్రహ ప్రత్యేకతలివే..
Vande Bharat Express: వందేభారత్ రైళ్ల సరాసరి వేగం 83 కిలోమీటర్లు
దేశంలో వందేభారత్ రైళ్లు సరాసరిన గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో నడిచేలా తయారైన ఈ రైళ్లను 130 కి.మీ. వేగంతో నడపవచ్చు. రైలు మార్గాల్లో నాణ్యత లేమి వల్ల తక్కువ వేగంతోనే నడుపుతున్నట్లు సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది. ‘‘అత్యల్పంగా గంటకు 64 కి.మీ. సరాసరి వేగంతో ముంబై–షిర్డీ వందేభారత్ రైలు, గరిష్టంగా 95 కి.మీ. వేగంతో న్యూఢిల్లీ–వారణాసి రైలు నడుస్తోందని చెప్పారు. ఆగ్రా కంటోన్మెంట్– తుగ్లకాబాద్ రైలు మాత్రం గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది’’ అని పేర్కొంది.
Vande Bharat Express: సికింద్రాబాద్–తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..
Baljeet Kaur: భారత పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ అదృశ్యం?
ఎనిమిది వేల మీటర్ల ఎత్తు ఉన్న నాలుగు పర్వతాలను అదిరోహించి రికార్డులకెక్కిన భారతదేశ పర్వతారోహకురాలు బల్జిత్ కౌర్ అదృశ్యమైంది. బల్జీత్ కౌర్ సప్లిమెంటరీ ఆక్సిజన్‌ను ఉపయోగించకుండా నేపాల్‌లోని ప్రపంచంలోనే 10వ ఎత్తైన అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించి తిరిగి వస్తుండగా క్యాంప్-4 వైపు వస్తుండగా బల్జీత్ కౌర్ కనిపించకుండా పోయింది. ఈమెతో పాటు మరో ఇద్దరు పర్వాతారోహకులు కనిపించడం లేదని సమాచారం. వీరి అచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే బల్జీత్ కౌర్ ప్రాణాలతో బయటపడినట్లు, అమెను ఏరియల్ సెర్చ్ టీమ్ గుర్తించిందని పయనీర్ అడ్వెంచర్ ప్రెసిడెంట్ పసాంగ్ షెర్పా తెలిపారు. అలాగే అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తూ రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌కు చెందిన పర్వతారోహకుడు అనురాగ్ మాలు ఏప్రిల్ 17న అదృశ్యం అయ్యాడు.
కాగా బల్జిత్ కౌర్ ఒకే నెలలో 8 వేల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న నాలుగు పర్వతాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డుకెక్కారు. ఆమె ప్రపంచంలోని 8 వేల మీటర్ల పైన ఉన్న ఆరు పర్వతాలను అత్యంత వేగంగా అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా(5 నెలల 2 రోజులు) కూడా రికార్డు సాధించారు.
Christina Koch: చంద్రుడిపైకి వెళ్లనున్న తొలి మహిళ క్రిస్టినా కోచ్..
National Panchayat Awards: తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట
తెలంగాణ గ్రామ పంచాయతీలు అవార్డుల పంట పండించాయి. జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎన్నికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాయి. మొత్తం 9 విభాగాలకుగాను 8 విభాగాల్లో విశేష ప్రతిభ కనబర్చి అవార్డులను సొంతం చేసుకొని రాష్ట్రపతితో ప్రశంసలు అందుకున్నాయి. జాతీయ పంచాయతీ అవార్డులు–2023లో భాగంగా కేంద్రం ప్రకటించిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ గెలుచుకుంది. 9 కేటగిరీల్లో అవార్డుల ఎంపిక జరగగా, 8 కేటగిరీల్లో పంచాయతీలు అవార్డులు సాధించాయి. దీంతో తెలంగాణను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేకంగా అభినందించారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో ఏప్రిల్ 17న జరిగిన పంచాయత్ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అధికారులు అందుకున్నారు.
Arogya Mahila Scheme: తెలంగాణలో ‘ఆరోగ్య మహిళ’ పథకం ప్రారంభం
నాలుగు కేటగిరీల్లో నాలుగు మొదటి ర్యాంకులు
దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగంలో నాలుగు కేటగిరీల్లో నాలుగు గ్రామాలు మొదటి ర్యాంకులు సాధించగా, రెండు గ్రామాలు రెండో ర్యాంకులను, మరో రెండు గ్రామాలు మూడో ర్యాంకులను సాధించాయి. ఐదు నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను తెలంగాణ కైవసం చేసుకుంది. అవార్డుల కార్యక్రమం అనంతరం మంత్రి ఎర్రబెల్లి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్ల జరుగుతున్న పల్లెప్రగతి కార్యక్రమం, అది సాధించిన ఫలితాలను వివరించారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (12-18 మార్చి 2023)
Menorca Open: మెనోర్కా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ చాంపియన్‌గా గుకేశ్
భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మెనోర్కా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించాడు. స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత గుకేశ్‌తోపాటు మరో తొమ్మిదిమంది ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా.. గుకేశ్, ప్రణవ్‌లకు తొలి రెండు ర్యాంక్‌లు లభించాయి. విజేతను నిర్ణయించేందుకు గుకేశ్, ప్రణవ్ మధ్య రెండు బ్లిట్జ్ టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల గుకేశ్ 1.5–0.5తో ప్రణవ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. గుకేశ్‌కు 3,000 యూరోలు (రూ.2 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొమ్మిది రౌండ్లలో గుకేశ్ ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న తెలంగాణ ప్లేయర్లు హర్ష భరతకోటి 6.5 పాయింట్లతో 11వ ర్యాంక్‌లో, వుప్పాల ప్రణీత్ 6 పాయింట్లతో 19వ ర్యాంక్‌లో, రాజా రిత్విక్ 5.5 పాయింట్లతో 37వ ర్యాంక్‌లో నిలిచారు.