అఫ్ఘాన్ క్రికెటర్ షఫీకుల్లాపై ఆరేళ్ల నిషేధం
Sakshi Education
అఫ్ఘానిస్థాన్ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ షఫీకుల్లా షఫఖ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఆరేళ్ల నిషేధం విధించింది.

రెండేళ్ల క్రితం అఫ్ఘాన్ ప్రీమియర్ లీగ్ టీ20తో పాటు 2019 ఏడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లలో షఫీకుల్లా అవినీతికి పాల్పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మే 11న ఏసీబీ వెల్లడించింది. 30 ఏళ్ల షఫీకుల్లా అఫ్ఘాన్ జాతీయ జట్టు తరఫున 24 వన్డేలు, 46 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు.
ప్రేక్షకులు లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్
ప్రేక్షకులు లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ జరిగే అవకాశం ఉందని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్‌ఎఫ్‌టీ) చీఫ్ బెర్నార్డ్ గైడిసెల్లి తెలిపారు. దాంతో ప్రతి ఏటా టోర్నీని కోర్టుల్లో ప్రత్యక్షంగా తిలకించే ఐదు లక్షలకుపైగా టెన్నిస్ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. అన్నివిధాలా ఆలోచించే టోర్నీని నాలుగు నెలలపాటు వాయిదా వేశామన్నారు. నిజానికి ఫ్రెంచ్ ఓపెన్ ఈ నెల 24న ఆరంభం కావాల్సి ఉండగా... కరోనా కారణంగా సెప్టెంబర్ మూడో వారానికి వాయిదా వేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అఫ్ఘాన్ క్రికెటర్ షఫీకుల్లా షఫఖ్‌పై నిషేధం
ఎప్పుడు : మే 11
ఎవరు : అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ)
ఎందుకు : అఫ్ఘాన్ ప్రీమియర్ లీగ్ టీ20తో పాటు 2019 ఏడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లలో షఫీకుల్లా అవినీతికి పాల్పడినందున

Published date : 11 May 2020 06:21PM