అఫ్గానిస్తాన్‌లో ఆస్ట్రేలియా సైనికుల క్రూరత్వం
Sakshi Education
అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి తర్వాత అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌తో జరిగిన పోరులో అమెరికాతోపాటు ఆస్ట్రేలియా ప్రత్యేక దళాలు నాడు పాల్గొన్నాయి.
ఆ కాలంలో ఆస్ట్రేలియా సైనికులు అఫ్గానిస్తాన్‌లో 39 హత్యలు చేశారని వార్ క్రైమ్స్ నివేదికలో పొందుపర్చారు. ఈ నివేదికను ఆస్ట్రేలియా డిఫెన్స్ ఫోర్స్‌కి చెందిన అధికారులు నవంబర్ 19న బహిర్గతం చేశారు. అమాయకులను చంపి వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించినట్లు నివేదికలో వెల్లడైంది. తమ సైనికుల హేయమైన చర్యపై ఆస్ట్రేలియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఆగ్నస్ కాంప్‌బెల్ అఫ్గాన్ ప్రజలకు క్షమాపణ చెప్పారు.
Published date : 20 Nov 2020 06:09PM