అఫ్గానిస్తాన్ మసీదులో భారీ పేలుడు
Sakshi Education
తూర్పు అఫ్గానిస్తాన్‌లోని నన్ఘఢార్ ప్రావిన్స్ హస్కమిన జిల్లాలో ఉన్న ఓ మసీదులో అక్టోబర్ 18న భారీ పేలుడు జరిగింది.
ఈ పేలుడు కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే, తూర్పుఅఫ్గానిస్తాన్‌లో తాలిబన్, అల్‌కాయిదా ఉగ్రసంస్థలు చురుకుగా ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లో హింస తారస్థాయికి చేరిందంటూ ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసిన మర్నాడే ఈ దాడి జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అఫ్గానిస్తాన్ మసీదులో భారీ పేలుడు
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎక్కడ : హస్కమిన జిల్లా, నన్ఘఢార్ ప్రావిన్స్, అఫ్గానిస్తాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అఫ్గానిస్తాన్ మసీదులో భారీ పేలుడు
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎక్కడ : హస్కమిన జిల్లా, నన్ఘఢార్ ప్రావిన్స్, అఫ్గానిస్తాన్
Published date : 19 Oct 2019 05:24PM