అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ ఎన్నిక
Sakshi Education
అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీనీ మరోసారి ఎన్నికయ్యారు.
అఫ్గానిస్తాన్ అధ్యక్ష పదవికి 2019, సెప్టెంబర్ 28వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం దాదాపు ఐదు నెలల తర్వాత ఫిబ్రవరి 18న వెలువరించింది. ఈ ఫలితాల్లో ఘనీకి 50.64 శాతం ఓట్లు లభించాయని ఎన్నికల సంఘం అధ్యక్షురాలు నూరిస్తానీ తెలిపారు. అఫ్గాన్ జనాభా 3.50 కోట్లు కాగా ఓటర్లు 96 లక్షలు. వీటిలో ఎన్నికల్లో పోలైంది 27 లక్షలు. అషఫ్ ్రఘనీ 2014, సెప్టెంబర్ 29న తొలిసారి అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : అష్రాఫ్ ఘనీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : అష్రాఫ్ ఘనీ
Published date : 19 Feb 2020 05:55PM