Skip to main content

అప్రూవల్‌ రేటింగ్‌ అంశంలో అగ్రస్థానంలో నిలిచిన దేశాధినేత?

గ్లోబల్‌ అప్రూవల్‌ రేటింగ్‌ అంశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.
Current Affairs
మోదీ తర్వాత రెండో స్థానంలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉన్నారు. గ్లోబల్‌ అప్రూవల్‌ రేటింగ్‌పై అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వే వివరాలు జూన్‌ 18న విడుదలయ్యాయి.

మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ గ్లోబల్‌ దేశాధినేతలకు ప్రజల్లో ఉన్న ఆమోదంపై లీడర్‌ అప్రూవల్‌ రేటింగ్‌ పేరుతో ట్రాక్‌ చేస్తుంది. ఇంటెలిజెన్స్‌ ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది. దాంతో పాటు ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహిస్తుంది. భారత్‌లో ఈ సర్వేలో 2,126 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ ట్రాకర్‌ ప్రకారం మోదీ పని తీరుౖపై 66 శాతం మంది అనుకూలంగా, 28 శాతం వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే మోదీకున్న ప్రజామోదం రేటింగ్‌ గత ఏడాదితో పోల్చి చూస్తే 20 పాయింట్లు పడిపోయింది. 2019 ఆగస్టులో కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసిన సమయంలో మోదీ ప్రజామోదం రేటు 82 శాతంగా ఉండేది. అప్పట్లో ఆయనను కేవలం 11 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. కరోనా మొదటి వేవ్‌ మొదలైన కొద్ది నెలల తర్వాత అత్యధికంగా మోదీ రేటింగ్‌ 84 శాతం ఉండేది.

ఎవరెవరికి ఎంత రేటింగ్‌ అంటే ...

నరేంద్ర మోదీ (భారత్‌)

66 శాతం

ఏంజెలా మెర్కెల్‌ (జర్మనీ)

53 శాతం

జో బైడెన్‌ (అమెరికా)

53 శాతం

జస్టిస్‌ ట్రూడో (కెనడా)

48 శాతం

బోరిస్‌ జాన్సన్‌ (యూకే)

53 శాతం

మూన్‌ జే ఇన్‌ (దక్షిణ కొరియా)

37 శాతం

ఎమ్మాన్యుల్‌ మాక్రాన్‌ (ఫ్రాన్స్‌)

35 శాతం

యొషిహిడె సుగా (జపాన్‌)

29 శాతం


క్విక్‌ రివ్యూ :

ఏమిటి : మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ వెల్లడించిన అప్రూవల్‌ రేటింగ్‌ అంశంలో అగ్రస్థానంలో నిలిచిన దేశాధినేత?
ఎప్పుడు : జూన్‌ 18
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ప్రపంచంలో...
ఎందుకు : మోదీ పనీతీరుపై అత్యధిక మంది సంతృప్తి వ్యక్తం చేసినందున...
Published date : 19 Jun 2021 06:50PM

Photo Stories