Skip to main content

అణ్వాయుధ వివరాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాకిస్తాన్

ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా భారత్, పాకిస్తాన్ దేశాలు వార్షిక అణ్వాయుధ నిల్వలు, అణ్వాయుధ నిర్మాణాల వివరాలను పరస్పరం వెల్లడించుకున్నాయి.
Current Affairs
ఇరు దేశాలు 30 ఏళ్ల క్రితం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ప్రతి యేటా జనవరి 1వ తేదీన అణ్వాయుధ సంపత్తికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేస్తారు. కాగా పాకిస్తాన్ జైళ్లలో ఖైదీలుగా ఉన్న 49 మంది సాధారణ పౌరులతో సహా 270 మంది జాలర్ల వివరాలను పాక్ వెల్లడించింది. అందుకు బదులుగా భారత్ సైతం భారతీయ జైళ్ళలో ఉన్న 340 మంది పాకిస్తాన్ ఖైదీల వివరాలను వెల్లడించింది.

భారత్-యూఏఈ...
భారత్‌లో 2021 నూతన సంవత్సర వేడుకలను గుర్తు చేసేలా యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) కూడా సంబరాలు చేసుకుంది. యూఏఈలో దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన భవనం ‘‘బుర్జ్ ఖలీఫా’’ భవనంపై భారతీయ జెండాను ప్రదర్శిస్తూ ఈ వేడుకలను జరిపింది.

యూఏఈ రాజధాని: అబూదాబి; కరెన్సీ: దిర్హం
యూఏఈ ప్రస్తుత అధ్యక్షుడు: ఖలీఫా బిన్ జాఝెద్ అల్ నహ్యాన్
యూఏఈ ప్రస్తుత ఉపాధ్యక్షుడు, ప్రధాని: మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్

క్విక్ రివ్యూ :

ఏమిటి : వార్షిక అణ్వాయుధ నిల్వలు, అణ్వాయుధ నిర్మాణాల వివరాలను పరస్పరం వెల్లడించుకున్న దేశాలు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : భారత్, పాకిస్తాన్
ఎందుకు : ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా
Published date : 02 Jan 2021 05:41PM

Photo Stories