అనుమతిలేని ‘డిపాజిట్’ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్
Sakshi Education
ఇన్వెస్టర్లను వంచించే పొంజి పథకాలు, అనుమతిలేని డిపాజిట్ పథకాలను నిషేధించే ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జారీ చేశారు.
శారదా స్కామ్, రోజ్‌వ్యాలీ చిట్ ఫండ్ స్కామ్ తరహా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నియంత్రించేందుకు ఈ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజు లోక్‌సభ ఆమోదం పొందగా, రాజ్యసభ ఆమోదం లభించలేదు. ఈ వారం మొదట్లోనే కేంద్ర కేబినెట్ ఈ ఆర్డినెన్స్ ను అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రపతిని అభ్యర్థించడం గమనార్హం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అనుమతిలేని డిపాజిట్ పథకాలను నిషేధించే ఆర్డినెన్స్
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇన్వెస్టర్లను వంచించే పొంజి పథకాలు, అనుమతిలేని డిపాజిట్ పథకాలను నిషేధించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అనుమతిలేని డిపాజిట్ పథకాలను నిషేధించే ఆర్డినెన్స్
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇన్వెస్టర్లను వంచించే పొంజి పథకాలు, అనుమతిలేని డిపాజిట్ పథకాలను నిషేధించేందుకు
Published date : 22 Feb 2019 05:13PM