Skip to main content

అన్ని వాహనాలకు ఏకీకృత కాలుష్య సర్టిఫికెట్

దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఇకపై ఏకీకృత పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairs
ఈ మేరకు కేంద్ర మోటార్‌ వెహికల్‌ చట్టాలు–1989లో సవరణలు చేసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసింది. తాజా నిర్ణయంతో ఇకపై అందజేసే పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌(పీయూసీ) సర్టిఫికెట్‌పై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రిస్తారు. ఆ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వాహనం, వాహన యజమాని పూర్తి వివరాలు కనిపిస్తాయి. అలాగే వాహనం కాలుష్యాన్ని ఎంత స్థాయిలో ఉద్గారాలను వెదజల్లుతోంది తదితర వివరాలన్నింటినీ పొందుపరుస్తారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : అన్ని వాహనాలకు ఏకీకృత కాలుష్య సర్టిఫికెట్‌(పీయూసీ సర్టిఫికెట్‌)
ఎప్పుడు : జూన్‌ 17
ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : వాహనం, వాహన యజమాని పూర్తి వివరాలు సులభంగా తెలుసుకోనేందుకు...
Published date : 18 Jun 2021 06:04PM

Photo Stories