Skip to main content

అన్ని రాష్ట్రాల్లోనూ దేశం-ఒకే రేషన్ అమలు చేయాలి: సుప్రీంకోర్టు

వలస కార్మికులకు, దినసరి కూలీలకు ప్రయోజనకర పథకంగా భావిస్తున్న ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు (వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్)’ పథకాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Current Affairs2021, జులై 31లోగా పథకాన్ని ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది. వ‌లస కార్మికులు ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు పేర్లను నమోదు చేసుకునేలా ఓ పోర్టల్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క‌మ్యూనిటీ కిచెన్‌ల‌ను కూడా నిర్వహించి.. కోవిడ్ మ‌హ‌మ్మారి వేళ ఎవ‌రూ ఆక‌లితో ఉండ‌కుండా చూడేలా ప్రభుత్వాలు చ‌ర్చలు చేప‌ట్టాల‌ని సూచించింది. వన్ నేషన్, వన్ రేషన్ కార్డు అమ‌లుపై దాఖ‌లైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచార‌ణ జ‌రిపిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం తాజా ఆదేశాలిచ్చింది.

జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, అర్హత కలిగిన లబ్ధిదారులు వన్ నేషన్, వన్ రేషన్ కార్డు ద్వారా దేశంలోని ఏదైనా చౌక ధరల దుకాణం(ఎఫ్‌పీఎస్) నుంచి తమ కోటా ఆహార ధాన్యాలను పొందగలుగుతారు. ఉపాధి కోసం లేదా దేశవ్యాప్తంగా తమ నివాస చిరునామా మార్చుకునే వలస కార్మిక లబ్ధిదారులు, దినసరి కూలీలు, ఇతర రంగాల కార్మికులకు ఈ వ్యవస్థ ప్రయోజనం చేకూరుస్తుంది. ఒకే కార్డు విధానం ద్వారా.. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రేష‌న్ కార్డు ఉన్న వ్యక్తి స్థానికంగా సబ్సిడీ ఆహార‌ధాన్యాలు తీసుకునే వీలు ఉంటుంది.
Published date : 29 Jun 2021 02:54PM

Photo Stories