అనంతపురంలో రెండు భారీ పరిశ్రమలు
గత కొన్నేళ్లుగా వీటికి అడ్డంకిగా ఉన్న జీవోను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఇది సాధ్యపడింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రికల్ బస్ యూనిట్‌తో పాటు ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కు నిర్మాణాలు ప్రారంభం అయ్యేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా ఉత్తర్వులతో వీర్‌వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో 120 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. అలాగే ఏపీఐఐసీ భాగస్వామ్యంతో 246.06 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్‌కు కూడా అడ్డంకులు తొలిగాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్, ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కు సంస్థలు ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్